ఆన్‌లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలి
● రూ.5 లక్షలకుపైగా పోగొట్టుకుని ఆత్మహత్యాయత్నం
● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
● మృతుడిది రూరల్ మండలం
ఆకుల కొండూర్
నిజామాబాద్ రూరల్: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ యువకుడు లక్షల రూపాయా లు పోగొట్టుకుని చివర కు తన ప్రాణాలను తీసుకున్నాడు. సుమారు రూ.5లక్షలకు పైగా పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు యత్నించిన సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారాడు. ఇటీవల లక్షల రూపాయలను గేమ్స్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడి ఐదారు రోజులక్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై రూరల్ సీఐ సురేశ్‌ను వివరణ కోరగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


