
ప్రశ్నించే గొంతుకల పై నిర్బంధం సరికాదు
సుభాష్‌నగర్: ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం విధిస్తూ అరెస్టులు చేయించడం సరికాదని, సీఎం రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ భూములను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, పాయల శంకర్‌ను పోలీసులు మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూములను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, నాయకులను అరెస్టు చేయడం సరికాదని, రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా.. నియంత పాలన కొనసాగుతోందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కోకాపేట భూములను అమ్మితే.. రేవంత్‌రెడ్డి ఏకంగా హెచ్‌సీయూ భూములు అమ్మకానికి పెడుతున్నాడని, ఈ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ పట్టిన గతి పట్టడం ఖాయమన్నారు. గుంట భూమి అమ్మినా ఊరుకోబోమని, ప్రజా ఉద్యమంగా మార్చి సెక్రెటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందా?
హెచ్‌సీయూకు చెందిన గుంట భూమి అమ్మినా ఊరుకోబోం
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్