రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపేస్తారు అధికారులు. అయితే.. ఓ పులి రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌కు రెడ్ సిగ్నల్ ఇచ్చి.. కేవలం పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పులి రోడ్డు దాటేందుకు ఇరువైపులా ట్రాఫిక్‍ను నిలిపేశారు. ఆ తర్వాత పులి దర్జాగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీన్ కశ్వాన్ శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘గ్రీన్ సిగ్నల్ ఓన్లీ ఫర్ టైగర్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఈ వీడియోలో ప్రధాన రహదారిపై రెండు వైపులా ట్రాఫిక్ నిలిపేసిన పోలీసు.. నిశబ్దంగా ఉండాలని సూచించారు. అప్పుడే పొదల్లోంచి ఓ పులి బయటకు వచ్చింది. దర్జాగా రోడ్డు దాటి మరోవైపు.. అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు టైగర్ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 1.1 లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురికాగా.. కొందరు అద్భుతంగా పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటనలు తరుచుగా విదేశాల్లో చూస్తుంటాం. మార్పు కనిపించటం భారత్‌కు మంచిదే.’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022
ఇదీ చూడండి: Tiger In River: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం
Comments
Please login to add a commentAdd a comment