tiger cub
-
తిరుపతి జూలో మరో ‘నంద్యాల’ పులికూన మృతి
సాక్షి, తిరుపతి: నగరంలోని ఎస్వీ జూపార్క్ లో పులికూన ఒకటి మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలలు క్రితం నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి తల్లికి దూరమైన 4 పులి పిల్లలు ఇక్కడికి తరలించిన సంగతి తెలిసిందే. జూకి తరలించిన కొన్నిరోజులకే ఒక కూన మృతి చెందగా, తాజాగా ఈ నెల 29వ తేదీన మరొకటి చనిపోయింది. కిడ్నీ,లివర్ సమస్యతో బాధపడుతూ ఈ పులికూన మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక.. బ్లడ్ శాంపిల్స్ తో మిగిలిన పులి కూనలకు పరీక్షలు చేస్తున్నారు అధికారులు. నంద్యాల అడవుల్లో తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు.. సమీప గ్రామంలోకి ప్రవేశించాయి. అయితే గ్రామస్తులు వాటిని రక్షించగా.. తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో.. చివరకు వాటిని జూకి తరలించారు. ఇదీ చదవండి: ‘వాతావరణం తట్టుకోలేవ్.. అవి చనిపోతాయని ముందే ఊహించాం!’ -
Tiger Cub: కారు డిక్కీలో పులి పిల్ల.. పోలీసులు షాక్..
మెక్సికో సిటీ: పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు వచ్చింది. వీళ్లను చూసి ఆపకుండా అది అలానే ముందుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి ఆపారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. 2020లోనూ రోడ్డుపై తిరిగుతున్న ఓ బెంగాల్ టైగర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో ఓ ఇంట్లో సింహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాల గర్జనకు బెంబేలెత్తిపోయిన పొరుగింటివారు ఫోన్ చేయడంతో అక్కడకు వెళ్లి వాటిని తరలించారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
ట్రాఫిక్ నిలిపేసి ‘టైగర్’కు గ్రీన్ సిగ్నల్.. నెటిజన్లు ఫిదా!
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపేస్తారు అధికారులు. అయితే.. ఓ పులి రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌కు రెడ్ సిగ్నల్ ఇచ్చి.. కేవలం పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పులి రోడ్డు దాటేందుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఆ తర్వాత పులి దర్జాగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీన్ కశ్వాన్ శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘గ్రీన్ సిగ్నల్ ఓన్లీ ఫర్ టైగర్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ప్రధాన రహదారిపై రెండు వైపులా ట్రాఫిక్ నిలిపేసిన పోలీసు.. నిశబ్దంగా ఉండాలని సూచించారు. అప్పుడే పొదల్లోంచి ఓ పులి బయటకు వచ్చింది. దర్జాగా రోడ్డు దాటి మరోవైపు.. అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు టైగర్ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 1.1 లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురికాగా.. కొందరు అద్భుతంగా పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటనలు తరుచుగా విదేశాల్లో చూస్తుంటాం. మార్పు కనిపించటం భారత్‌కు మంచిదే.’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022 ఇదీ చూడండి: Tiger In River: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
కొరియర్లో పులి పిల్ల!
సాధారణంగా కొరియర్లో మనం ఏమేం పంపిస్తుంటాం.. పుస్తకాలో, ఫోన్లో, ఇతరత్రా వస్తువులో.. కానీ మెక్సికోలో మాత్రం స్మగ్లర్లు పులిపిల్లను కొరియర్ చేశారు. దానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పులి పిల్లను పంపిన ప్లాస్టిక్ డబ్బాలో మెత్తదనం కోసం పేపర్లు నింపి ఊపిరాడేందుకు డబ్బాకు రంధ్రాలు పెట్టారు. మెక్సికో పశ్చిమ రాష్ట్రం జాలిస్కో నుంచి మధ్య రాష్ట్రం క్వెరెటారోకు ఈ కొరియర్‌ను ఆర్డర్ చేశారు. ఇంత జాగ్రత్త పడినా దొరికిపోయారు. ఎలాగంటారా.. జాలిస్కోలోని ట్లాక్వుపాగ్యు నగరలో బస్ స్టేషన్లో తనిఖీలు చేస్తున్నపుడు ఓ ప్లాస్టిక్ కంటెయినర్లో శబ్దం, కదలికలు, వాసనను గుర్తించాయి పోలీసు జాగిలాలు. అందులో ఏముందో అని తనిఖీ చేసిన అధికారులకు రెండు నెలల బెంగాల్ టైగర్ కనిపించింది. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న పులి పిల్లను చూసిన అధికారులు తొలుత కంగారుపడినా.. వెంటనే తేరుకొని జంతుసంరక్షణ అధికారులకు అప్పగించారు. దీన్ని బట్టి కొరియర్‌కు కాదేదీ అనర్హం అనాలేమో.. -
వరదలో చిక్కుకున్న పులిపిల్లను రక్షించిన యువకులు
-
అనంతగిరిలో పులి కలకలం
అనంతగిరి (విశాఖపట్నం) : విశాఖపట్నం అనంతగిరి పరిధిలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో విజయనగరం, విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆనవాళ్ల సేకరణ కోసం శుక్రవారం అనంతగిరి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పులి పిల్ల రైలు కింద పడి గాయపడిందని, అప్పటి నుంచి పులి ఇక్కడే సంచరిస్తోందని స్థానికులు భయపడుతున్నారు. రైల్వే గేట్‌మెన్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులకు రెండు రోజుల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు తెగిపడి మూలుగుతున్న పులిపిల్ల కనపడింది. వెంటనే దాన్ని దగ్గరకు తీసి సపర్యలు చేసి వదిలేశారు. దీంతో దాని తల్లి ఇదే ప్రాంతంలో తిరుగుతోందని.. దాని వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని రైల్వే సిబ్బంది అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం అటవీ అధికారులు రంగంలోకి దిగారు.