OTT Review: ఊహకందని థ్రిల్లింగ్‌ వెకేషన్‌ | Hollywood Movie Traffic OTT Review: Inturu Harikrishna | Sakshi
Sakshi News home page

OTT Review: ఊహకందని థ్రిల్లింగ్‌ వెకేషన్‌

Published Sun, Nov 3 2024 3:51 AM | Last Updated on Sun, Nov 3 2024 11:47 AM

Hollywood Movie Traffic OTT Review: Inturu Harikrishna

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘ట్రాఫిక్‌’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

వెకేషన్‌ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్‌. కానీ అదే వెకేషన్‌ ఊహకందని, ఊహించలేని నైట్‌ మేర్‌ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్‌ దర్శకుడు డీన్‌ టేలర్‌ ‘ట్రాఫిక్‌’ చిత్రాన్ని  రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్‌ ఆప్స్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటులు లీడ్‌ రోల్స్‌లో నటించారు.

ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్‌. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్‌ గెస్ట్‌ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్‌ లొకేషన్‌ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్‌ స్టేషన్‌లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.

ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్‌ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్‌ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్‌ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత  తన జర్నలిస్ట్‌ కెరీర్‌లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘ట్రాఫిక్‌’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్‌ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్‌ ‘ట్రాఫిక్‌’ సినిమాతో థ్రిల్లింగ్‌ వెకేషన్‌ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్‌ ది ‘ట్రాఫిక్‌’.               

– ఇంటూరు హరికృష్ణ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement