
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్‌ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్‌ప్యాడ్‌ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.
— Elon Musk (@elonmusk) April 12, 2025