టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో రహానే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవాతో ముంబై జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన లక్ష్యా గార్గ్ బౌలింగ్‌లో.. రహానే ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పృథ్వీ షా కూడా 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా భారత జట్టులో రహానే తిరిగి స్ధానం దక్కించుకోవాలంటే తాను ఎంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టులోకి రావడం కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది రంజీ సీజన్‌లో సౌరాష్ట్రతో జరగిన తొలి మ్యాచ్‌లో రహానే సెంచరీ సాధించాడు. దీంతో ఫామ్‌లోకి అతడు వచ్చాడని అంతా భావించారు. అయితే గోవాతో జరుగుతోన్న మ్యాచ్‌లో రహానే డకౌట్ అయ్యి మళ్లీ అందరనీ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియాలో మరో సారి రహానే ఆటతీరుపై నెటిజన్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా" అంటు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs SL: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు... అతడికి అవకాశం ఇవ్వండి'
Comments
Please login to add a commentAdd a comment