బాబోయ్.. బాతు! | Goose attack on 5-year-old Houston girl goes viral | Sakshi
Sakshi News home page

బాబోయ్.. బాతు!

Published Sun, May 8 2016 4:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

బాబోయ్.. బాతు! - Sakshi

బాబోయ్.. బాతు!

అమెరికాలోని హూస్టన్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ‘సమ్మర్’పై ఓ తల్లిబాతు దాడి చేస్తున్న చిత్రాలు... భీతిల్లిన సమ్మర్ పరుగెడుతూ కిందపడిపోయిన దృశ్యాలు గతవారం ట్విటర్‌లో హల్‌చల్ చేశాయి. ఓ చిన్నారి అంత భయపడిపోతే... చూసి ఆనందిస్తారా? అంటూ ముఖం చిట్లించకండి. ఆమెకు ఏమీ కాలేదు. పైగా ఈ ఫోటోలను పోస్ట్ చేసింది స్వయంగా ఆమె సోదరి స్టీవీ గిడెన్. ఓ రోజు సాయంత్రం స్టీవీ, సమ్మర్‌లు వ్యాహ్యళికి వెళ్లినపుడు రోడ్డు పక్కన చిన్న బాతు పిల్లలు కనిపించాయట.

ముద్దొస్తుండటంతో చూద్దామని కాసింత దగ్గరగా వెళ్లారంతే. తల్లిబాతుకు కోపం వచ్చి సమ్మర్‌పై ఇలా ప్రతాపం చూపింది. చిన్నారి సమ్మర్ కాసేపు హడలిపోయినా... గాయాలేమీ లేకుండా క్షేమంగా బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement