PC: IPL
ఐపీఎల్ 2022లో ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్ ఫేలవ ఆటతీరును కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ విధించిన 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి కొనితెచ్చుకుంది. కాగా ఈసారి మెగావేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఏరికోరి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ఆటగాడు మినహా పెద్దగా పేరున్న ఆటగాళ్లు కూడా ఎవరు లేరు.
ఎస్‌ఆర్‌హెచ్ పూరన్‌పై ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలియదు గాని అతను మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటికి నుంచి ఇబ్బందిగా కనిపించిన పూరన్ చివరకు 9 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక పూరన్ ఐపీఎల్‌లో డకౌట్ల విషయంలో మరో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు పూరన్ ఆడిన 32 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు డకౌట్ అయ్యాడు. కాగా పూరన్ ఆటతీరుపై ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ''రూ. 10 కోట్లు దండగ.. ఎంతమంది వచ్చినా ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు మారదు.. కోట్లు పెట్టి కొంటే డకౌట్ అయితే ఎలా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: Sanju Samson: ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్..
నికోలస్ పూరన్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి
Nicholas Pooran registered his 6th IPL duck from the 32 innings he has played.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022
When Hyderabad bats.
— Virender Sehwag (@virendersehwag) March 29, 2022
#SRHvRR pic.twitter.com/Bt7XijdS5Y
Comments
Please login to add a commentAdd a comment