వాషింగ్టన్: ఇటీవల కాలంలో మనుష్యుల మాదిరిగా తాము అన్ని చేయగలమంటూ జంతువులు, పక్షులు ఏవిధంగా అనుకరిస్తున్నాయో చూస్తునే ఉన్నాం. అచ్చం అలానే ఇక్కడొక రింక్ల్ బాతు తాను సైతం మారథాన్ చేయగలనంటూ న్యూ యార్క్ సిటీ మారథాన్‌లో పాల్గొంది. పైగా అక్కడ మారథాన్‌లో పాల్గొన్న వాళ్లలా చక్కగా నడిచేసింది. గతేడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా మారథాన్ నిర్వహించలేదన్న సంగతి తెలిసింతే.
(చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు)
కానీ ఈ ఏడాది న్యూయర్క్ సిటీలో నిర్వహించిన మారథాన్‌లో బాతు పాల్గోని న్యూయార్క్ వాసులకి కనువిందు చేయడమే కాక ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అక్కడ ఉన్న ప్రేక్షకులు సైతం కమాన్ కమాన్ అంటూ ఆ బాతుని ఉత్సాహపరిచారు. అయితే దీనికి సంబంధించిన వీడియోతోపాటు " నేను మారథాన్‌లో పరుగెత్తాను. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పరుగెత్తుతాను" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’)
Comments
Please login to add a commentAdd a comment