Ashes 2021-22: Eng Vs Aus, Pat Cummins Terrific Bowling Leads To Hameed Haseeb Duck Out - Sakshi
Sakshi News home page

Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్‌ చేశాడు

Published Mon, Dec 27 2021 8:33 AM | Last Updated on Mon, Dec 27 2021 9:46 AM

Ashes 2021: Pat Cummins Terrific Bowling Dismiss Hameed Hasib Duck Out - Sakshi

Pat Cummins Terrific Bowling To Hameed Hasib At Last Duck Out Viral..  యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆసీస్‌ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది. రూట్‌ అర్థశతకం మినహా మిగతావారెవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రలియా తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. 

చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా!

ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 3 వికెట్లతో చెలరేగడమే కాదు.. తన బంతులతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇక ఇంగ్లండ్‌ ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌కు కమిన్స్‌ తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. గుడ్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌన్సర్లు, షార్ట్‌పిచ్‌ బాల్స్‌తో కమిన్స్‌.. హమీద్‌ను బెంబేలెత్తించాడు. చివరకు అతన్ని డకౌట్‌ చేసి వారెవ్వా అనిపించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ కమిన్స్‌ వేయగా.. మొదటి నాలుగు బంతులను టచ్‌ చేయడానికే భయపడగా... ఐదో బంతిని టచ్‌ చేయాలా వద్దా అని హమీద్‌ అనుకునే లోపే బంతి బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్‌ క్యారీ చేతుల్లో పడింది. అలా హమీద్‌ డకౌట్‌ అయి పెవిలియన్‌కు నిరాశగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: AUS vs ENG: పాపం రూట్‌.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement