కాన్‌బెర్రా: చిలకలు, కోయిలలు, గోరింకలు మనుషులను అనుకరించడం మనకు తెలుసు. ఇదే తరహాలో కస్తూరి ఆనే పేరుగల బాతు "యూ బ్లడీ ఫూల్" అంటూ మనుషుల మాటల్ని అనుకరిస్తోంది. నెదర్లాండ్స్ ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్‌కి చెందిన రాయల్ సొసైటీ బయోలాజికల్ రీసెర్చ్ జర్నల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి పక్షి శాస్త్రవేత్త పీటర్ ఫుల్లగర్ రికార్డు చేసిన పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. (చదవండి: ఔరా! ఈ కుండ దేనితో తయారు చేశారు.. రాయితో కొట్టినా పగలదే..)
ఈ సందర్భంగా లండన్ యూనివర్సిటీ సైంటిస్ట్ కారెల్ టెన్ కేట్ మాట్లాడుతూ.." నేను మొదట బాతులు మనుషుల మాటలను అనుకరించడం నిజమా కాదా అని ఆలోచించాను. కానీ 1980లో ఆస్ట్రేలియన్ బర్డ్ పార్క్‌లో పీటర్ ఫుల్లగర్ రికార్డు చేసిన పాత వీడియోలు, పరిశోధన పత్రాలతోపాటు తాను మళ్లీ పరిశోధనలు చేసి తెలుసుకునేంత వరకు నమ్మలేదు అని అన్నారు.
అయితే ఉచ్ఛారణ అనేది చాల ఆసక్తి కరమైనది, రిప్పర్ అనే వ్యక్తి మిమిక్రి బాగా చేయగలడని, మనుషుల్ని, శబ్దాలను బాగా అనుకరిస్తాడని చెప్పారు. ఇది కచ్చితంగా మానవుని వాయిస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. కొన్ని ప్రత్యేకమైన పక్షులు చిలకలు, కోయిలలు, గోరింకలు మానువునిలా మాట్లాడగలవు కానీ బాతులు మనుష్యులను అనుకరించటం అసాధారణమైనది, ప్రత్యకమైనది కూడా అని చెప్పారు.
(చదవండి: షాపింగ్‌మాల్ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..)
Comments
Please login to add a commentAdd a comment