Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. 15 ఓవర్ల వరకు 130/4తో సాధారణంగా ఉన్న గుజరాత్ స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులకు చేరుకుంది. అంటే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 97 పరుగులు చేసింది. మిల్లర్, అభినవ్ మనోహర్‌లకు తోడుగా రాహుల్ తెవాటియా చివర్లో విధ్వంసం సృష్టించడంతో గుజరాత్ 200 మార్కు దాటింది.
అయితే గ్రీన్ వేసిన 18వ ఓవర్ ముంబైకి కలిసి రాలేదు. ఆ ఓవర్‌లో అభినవ్ మనోహర్ రెండు సిక్సర్లు కొట్టగా.. మిల్లర్ ఒక సిక్సర్ కొట్టడంతో మొత్తంగా ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మెరిడిత్ బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు వచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లో తెవాటియా మరో రెండు సిక్సర్లు బాదాడు.
అర్జున్‌ను నమ్మని రోహిత్
అయితే వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్ కనబరిచాడు. రెండు ఓవర్లు వేసిన అతను 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంప ముంచాడు.
ఈ మ్యాచ్‌లో కూడా మరోసారి అలాగే వేస్తే ఏం చేయలేమని రోహిత్ భావించి ఉంటాడు. కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో అర్జున్ బౌలింగ్ కాస్త బెటర్ అనిపించింది. ఆ 18వ ఓవర్ కామెరాన్ గ్రీన్‌తో కాకుండా అర్జున్‌తో వేయించి ఉంటే బాగుండేదని.. వికెట్లు తీసేవాడేమోనని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు.
చదవండి: 'అర్జున్‌ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
Comments
Please login to add a commentAdd a comment