IPL 2022: 5 Teams That Pick Shreyas Iyer Mega Auction For Huge Price - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: శ్రేయాస్‌ కోసం ఐదు ఫ్రాంచైజీల మధ్య పోటీ.. కెప్టెన్‌ అవకాశాలే ఎక్కువ

Published Fri, Dec 3 2021 1:12 PM | Last Updated on Fri, Dec 3 2021 3:27 PM

IPL 2022: 5 Teams That Pick Shreyas Iyer Mega Auction For Huge Price - Sakshi

Huge Competition For Shreyas Iyer In IPL 2022 Auction.. జనవరిలో జరగనున్న ఐపీఎల్‌ మెగా వేలంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ కోసం ఫ్రాంచైజీలు భారీగానే పోటీపడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్‌ అయ్యర్.. 2020 ఐపీఎల్‌లో జట్టును ఫైనల్‌ చేర్చాడు. అయితే ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక అయ్యర్‌ గాయంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ రిషబ్‌ పంత్‌కు  నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. పంత్‌ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. అయితే కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంటిబాట పట్టింది. క్వాలిఫయర్‌లో ఓడినప్పటికి ఐపీఎల్‌ 2022‌కు(ఐపీఎల్ 15వ సీజన్‌) రిషబ్‌ పంత్‌నే కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ను రిటైన్‌ చేసుకోలేదు. ఆటగాడిగా తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని.. అందుకే రిటైన్‌ చేసుకోలేదని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 2375 పరుగులు చేసిన అయ్యర్‌పై ఐదు ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. వాటిలో అహ్మదాబాద్‌, లక్నోతో పాటు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఉన్నాయి. 

చదవండి: Hardik Pandya: 'ముంబై నన్ను వదిలేసింది'.. హార్దిక్‌ పాండ్యా భావోద్వేగం

అహ్మదాబాద్‌, లక్నో ఫ్రాంచైజీలు:


ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు కావడం.. అయ్యర్‌కు సానుకూలాంశంగా మారింది. ఇప్పటికే లక్నోకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉండడంతో బ్యాటింగ్‌ బలోపేతం చేయడానికి అయ్యర్‌ లాంటి ఆటగాడి అవసరం ఉండడంతో లక్నో ఫ్రాంచైజీ అయ్యర్‌పై భారీగా వెచ్చించే అవకాశం ఉంది. మరోవైపు అహ్మదాబాద్‌ కూడా అయ్యర్‌ కోసం పోటీపడే అవకాశం ఉంది. వీలైతే అహ్మదాబాద్‌కు కెప్టెన్‌ చేసే అవకాశం కూడా ఉంది. 

కింగ్స్‌ పంజాబ్‌:


ఇక కింగ్స్‌ పంజాబ్‌ విషయానికి వస్తే.. కేఎల్‌ రాహుల్‌ను పంజాబ్‌ వదులుకోవడంతో ఆ జట్టుకు ఇ‍ప్పుడు కొత్త కెప్టెన్‌ అవసరం చాలా ఉంది. పైగా అయ్యర్‌ కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన రికార్డు ఉండడంతో అతన్ని దక్కించుకోవడం కోసం పంజాబ్‌ కచ్చితంగా ప్రయత్నిస్తోంది. ఇక అయ్యర్‌ పంజాబ్‌కు ఎంపికైతే మాత్రం కచ్చితంగా కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాయంక్‌ అగర్వాల్‌ను భారీ ధరకు రిటైన్‌ చేసుకున్న పంజాబ్‌.. అతనికి అండగా అయ్యర్‌ను జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంది.

చదవండి: Rcb Captain: అతని కోసం ఆర్‌సీబీ పోటీ పడుతుంది.. కెప్టెన్‌గా అతనే సరైనోడు

ముంబై ఇండియన్స్‌:


ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు శ్రేయాస్‌ అయ్యర్‌పై చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే అతన్ని జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని పరోక్షంగా చేయనున్నాడు. అసలే రిచ్‌ టీమ్‌గా పేరున్న ముంబై అయ్యర్‌కోసం ఎంత ధర అయినా వెచ్చించే అవకాశం ఉంది. పైగా ఇషాన్‌ కిషన్‌ ను వదులుకున్న ముంబైకి ఒక నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ అవసరం. ఆ లక్షణాలు అయ్యర్‌లో పుష్కలంగా ఉండడంతో అతన్ని దక్కించుకోవడానికి పోటీ పడడం ఖాయం.

ఆర్‌సీబీ:


ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆర్‌సీబీ కూడా శ్రేయాస్‌ అయ్యర్‌ కోసం పోటీ పడే అవకాశం ఉంది. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌లను మాత్రమే రిటైన్‌ చేసుకున్న ఆర్‌సీబీ శ్రేయాస్‌ అయ్యర్‌ కోసం భారీగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయ్యర్‌ కోసం పోటీ పడడంపై పరోక్షంగా కోహ్లి సలహా కూడా ఒక కారణమని తెలిసింది. పైగా మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌ చేయకుంటే.. అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి శ్రేయాస్‌ అయ్యర్‌ను ఎవరు దక్కించుకుంటారో.

చదవండి: IPL 2021 Auction: ‘వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement