IPL 2023, PBKS Vs MI: Arshdeep Singh Also Bowled The Most Expensive Spell Of His IPL Career - Sakshi
Sakshi News home page

#ArshdeepSingh: ఆర్చర్‌ను మించిపోయిన అర్ష్‌దీప్‌..

Published Wed, May 3 2023 11:29 PM | Last Updated on Thu, May 4 2023 10:47 AM

Most expensive Spell For Arshdeep-IPL 2nd Time 3-Games Conceed 50-plus - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కొండంత లక్ష్యం ముందున్న ఏ మాత్రం బెదరని సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లు పంజాబ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఒక దశలో 15 ఓవర్లలోనే మ్యాచ్‌ పూర్తవుతుందా అన్న సందేహం కలిగింది.

ఇక మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. 3.5 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్‌కు మోస్ట్‌ Expensive స్పెల్‌ ఇదే. ఇక ఈ సీజన్‌లో అర్ష్‌దీప్‌ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ ప్లస్‌ రన్స్‌ ఇవ్వడం గమనార్హం. ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయడం అర్ష్‌దీప్‌కు ఐపీఎల్‌లో ఇది రెండోసారి.

ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌.. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. తాజాగా చెత్త బౌలింగ్‌తో అర్ష్‌దీప్‌ ఆర్చర్‌ను మించిపోయాడు.

చదవండి: PBKS Vs MI: ముంబై ప్రతీకారం.. పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement