Bhuvneshwar Kumar Wife Hits Out Against Trolls - Sakshi
Sakshi News home page

Ind vs Aus: మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం​ బాగు చేసుకోండి! భువీ భార్య కౌంటర్

Sep 22 2022 8:12 PM | Updated on Sep 22 2022 9:21 PM

Bhuvneshwar Kumar's wife hits out against trolls - Sakshi

టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ డెత్‌ ఓవరల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్‌-2022లోనూ డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించకున్న భువీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన భువీ.. ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ ఆసీస్‌ సొంతమైంది.

ఈ క్రమంలో తన చెత్త బౌలింగ్‌ కారణంగానే భారత్‌ డెత్‌ ఓవర్లలో  విఫలమైంది అని భువనేశ్వర్‌ నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌ను ట్రోల్‌చేస్తున్న ట్రోలర్స్‌కు అతడి భార్య నుపుర్ నగర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ట్రోల్స్  చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని సోషల్‌ మీడియా వేదికగా నగర్‌ ఫైర్‌ అయింది. 

"ఈ రోజుల్లో చాలా మంది ఏ పనికి రానివారు. వాళ్లు ఏమి చేయరు. ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ ఒకరిపై విమర్శలు, ద్వేషం వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్లకు చాలా సమయం ఉంది. వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే..  మీ మాటల వల్ల ఎవరూ ప్రభావితం కారు.

అంతేకాకుండా మీ ట్రోల్స్‌ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇతరలను విమర్శించే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం కోసం మీ జీవితాలను బాగు చేసుకోవడం. అది మీకు చాలా కష్టమే అని నాకు తెలుసు" అని నగర్‌ ఇన్‌స్టాగ్రామ్ రాసుకొచ్చింది.
చదవండి: Ind vs Aus 2nd T20: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement