సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా ప్రశంసించింది. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన ట్విటర్ ఖాతాలో.. 'యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని ఎన్‌డీటీవీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించింది. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా?' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వాటే గ్రేట్ ఫాల్!
యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని NDTV ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించింది. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా? pic.twitter.com/PMFdZtGN4F
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 13, 2020
కాగా మరో ట్వీట్‌లో 'టీడీపీ పాలనలో దోచుకోవడమే కానీ ప్రజలకు పైసా విదిల్చింది లేదు. కరోనా కష్ట సమయంలో దానశీలులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ప్రతి చోట అన్నార్తులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. దాచుకోవడమే తెలిసినవాళ్లు దొంగల్లా పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నారు' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment