ఏ రాష్ట్రంలో అల్లర్లు జరిగినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుందని ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ అన్నారు.
ఏ రాష్ట్రంలో అల్లర్లు జరిగినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుందని ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ అన్నారు. 2002 గుజరాత్ మత ఘర్షణలకు నరేంద్రమోడీ బాధ్యుడా? కాదా? అనే విషయంపై సోమవారం ఎన్‌డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. పైవ్యాఖ్యలు చేశారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే దానికి నేనే బాధ్యత తీసుకోవాలి.
నేరుగా అందులో పాలుపంచుకోకపోయినా.. ఓ ముఖ్యమంత్రిగా, ఓ ప్రజాప్రతినిధిగా పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంటుంది’’ అని చెప్పారు. గతంలో ఇదే అంశంపై పవార్ స్పందిస్తూ గుజరాత్ అల్లర్లకు మోడీని బాధ్యుడిని చేయడం సరికాదని, కోర్టు కూడా ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పారు. 2002 అల్లర్లకు సంబంధించి కోర్టు తీర్పును ఆమోదించాల్సి ఉంటుందన్నారు.