సాక్షి, ముంబై: నేషనలిస్ట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత శరద్ పవార్ తాను అప్పుడే ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విషయం సూటిగా చెప్పినట్టు తన ఆత్మకథ 'లోక్ మాఝే సంగతి' పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. పవార్ ఆత్మకథ బుధవారం విడుదలైన సందర్భంగా అందులోని విషయాలు తెరపైకి వచ్చాయి.
ఆ పుస్తకంలో పవార్ తాను 2019 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీని కలిశానని రాశారు. అప్పుడూ బీజేపీ ఎన్సీపీతో పొత్తుకు అవకాశం ఉందా? అనే దాని గురించి అన్వేషించిందని, కానీ తాను ఆసక్తి కనబర్చ లేదన్నారు పవార్. ఐతే బీజేపీతో మాత్రం అధికారిక చర్చలు జరగలేదని, కేవలం బీజేపీ మాత్రమే బంధాన్ని కోరుకున్నదని చెప్పారు.
కానీ ఇరు పార్టీల నుంచి ఎంపిక చేసిన నాయకుల మధ్య మాత్రం అనధికారిక చర్చలైతే జరిగాయని పవార్ పుస్తకంలో తెలిపారు. తాను ఆ సమావేశం సమయంలోనే మోదీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లీయర్‌గా చెప్పేశానని పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాదు మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై అనిశ్చిత ఏర్పడిన తర్వాత ఎన్సీపీ, బీజేపీ నేతల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి టైంలో కూడా..
అంతేగాదు అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో కూడా ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాని బీజేపీ కోరుకున్నట్లు పేర్కొన్నారు. 2014లో కాషాయ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలిపారు. అందుకే ఆ పార్టీని విశ్వసించలేమని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కానీ మెజార్టీకి దూరమైందన్నారు.
ఆ సమయంలోనూ బీజేపీ తమ పార్టీతో చర్చలు జరిపిందని, అయితే, ఆ సమయంలో తాను లేనని చెప్పుకొచ్చారు పవార్. ఈక్రమంలోనే ప్రభుత్వంలో భాగమైన శివసేనతో హఠాత్తుగా బీజేపీ బంధాన్ని ఏర్పరుచుకుందని చెప్పారు. ఈ పరిణామాల తర్వాత మా నాయకులు రియలైజ్ అయ్యి బీజేపీని విశ్వసించమని చెప్పినట్లు పుస్తకంలో వెల్లడించారు శరద్ పవార్.
(చదవండి: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా? కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్)
Comments
Please login to add a commentAdd a comment