
ఎన్‌డీటీవీకి రూ.24 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ : ఎన్‌డీటీవీకి మొదటి త్రైమాసిక కాలానికి రూ.24 కోట్ల నికర నష్టం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1 కోటి నష్టం పొందామని ఎన్‌డీటీవీ తెలిపింది. గత క్యూ1లో రూ.147 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.120 కోట్లకు తగ్గిందని పేర్కొంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ కామర్స్ వెంచర్స్ కోసం తొలి దశలో 8 కోట్ల డాలర్ల నిధులను సమీకరించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 2 శాతం వృద్ధితో రూ.127కు పెరిగింది.