సాగర్ సిమెంట్స్ లాభం రూ. 15 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సాగర్ సిమెంట్స్ రూ. 153 కోట్ల ఆదాయంపై రూ. 15 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 181 కోట్లు కాగా లాభం రూ. 22 కోట్లు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 548 కోట్ల నుంచి రూ. 621 కోట్లకు పెరగ్గా లాభం సుమారు రూ. 50 కోట్లుగా నమోదైంది.
కల్బుర్గి సిమెంట్‌లో వాటాల విక్రయంతో వచ్చిన నిధుల కారణంగా క్రిత ఆర్థిక సంవత్సరం లాభం రూ. 297 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. గురువారం బీఎస్‌ఈలో సంస్థ షేరు సుమారు అరశాతం తగ్గి రూ. 635 వద్ద క్లోజయ్యింది.