న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్‌మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్‌కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్‌ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది.
చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్‌ఆర్‌పీఆర్‌ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్‌డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment