జాతీయస్థాయిలోనూ వైఎస్‌ జగన్‌ ప్రకంపనలు! | NDTV exclusive interview with YS Jagan | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 8:10 PM | Last Updated on Wed, Jul 25 2018 5:35 PM

NDTV exclusive interview with YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ‘ఆన్‌ రియాలిటీ చెక్‌’  కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌.. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌తో ముచ్చటించారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ప్రసారమైన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ జైన్‌ అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గతంలో చేసిన ప్రకటననే తాజాగా మరోసారి చేశారని, అయినా చంద్రబాబు ఎందుకు తన మంత్రులను కేంద్ర కేబినెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. బీజేపీతో లింక్స్‌ ఉన్నాయా? అని శ్రీనివాసన్‌ జైన్‌ ప్రశ్నించగా.. బీజేపీతో లింక్స్‌ ఉంటే.. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతామని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపి తనను కేసులలో ఇరికించాయని, దివంగత నేత వైఎస్‌ఆర్‌ బతికి ఉన్నంతకాలం తనను గౌరవనీయుడిగా చూశారని, ఆయన చనిపోయిన తర్వాత క్షుద్రరాజకీయాల్లో భాగంగా తనను టార్గెట్‌ చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని అన్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా? ఏపీ ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు, ఒక ప్రభంజనంలా కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందా? అన్నది తెలుసుకునేందుకు.. జననేత వైఎస్‌ జగన్‌తో ఎన్డీటీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఆన్‌ రియాలిటీ చెక్‌’  కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌.. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌తో ముచ్చటించారు. ఈ కార్యక్రమం గురించి శ్రీనివాసన్‌ జైన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘వైఎస్‌ఆర్‌ బతికి ఉన్నంతవరకు నన్ను గౌరవనీయుడిగానే చూశారు’ అన్న వైఎస్‌ జగన్‌ కామెంట్‌ను ఉటంకించారు. ఆయన రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపే అవకాశముందని పేర్కొ‍న్నారు. ఈ పాదయాత్ర జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపనుందా? అని వైఎస్‌ జగన్‌ను ప్రశ్నించినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement