న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జాతీయ ఛానల్ ఎన్డీ టీవీ ఇండియా ప్రసారాలు నిలిపేయాలన్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఎన్బీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పటాన్ కోట్ దాడిని మిగతా ఛానళ్లు ప్రసారం చేసినా... కేవలం ఎన్డీ టీవీ ఇండియాపైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది.
కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఎన్డీటీవీ లైవ్ ప్రసారాల వల్ల రక్షణ రహస్యాలు భంగం వాటిల్లిందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.