air off
-
ఎన్డీ టీవీకి ఊరట...!
న్యూఢిల్లీ : జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు ప్రసారాలు నిలిపేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీ టీవీపై నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పఠాన్కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ప్రసారాలు ఒకరోజుపాటు నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకున్న విషయం విదితమే. -
ఎన్డీ టీవీపై చర్యను ఖండించిన ఎన్బీఏ
న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జాతీయ ఛానల్ ఎన్డీ టీవీ ఇండియా ప్రసారాలు నిలిపేయాలన్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఎన్బీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పటాన్ కోట్ దాడిని మిగతా ఛానళ్లు ప్రసారం చేసినా... కేవలం ఎన్డీ టీవీ ఇండియాపైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఎన్డీటీవీ లైవ్ ప్రసారాల వల్ల రక్షణ రహస్యాలు భంగం వాటిల్లిందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. -
ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేత
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి సమయంలో ప్రోగ్రాం కోడ్ ను ఉల్లఘించి కీలక ప్రదేశాలను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్ర ప్రసారాల శాఖ ఎన్డీటీవీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. మంత్రుల కమిటీ చేసిన సూచనల ప్రకారం దాడిని ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల టెర్రరిస్టులపై ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలు ప్రసారమైనట్లు నిర్దారణ జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని ఎన్డీటీవీని కోరినట్లు తెలిపింది. కాగా, ఎన్డీటీవీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని వెల్లడించింది. ఎయిర్ బేస్ లోని విమానస్ధావరాలు, యుద్ద విమానాలు, రాకెట్ లాంచర్లు, మోటార్లు, హెలికాప్టర్లు, ప్రెట్రోల్ ట్యాంకులు తదితరాలను ఎన్డీటీవీ ప్రసారం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్డీటీవీకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.