News Broadcasters Association
-
ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్బీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానళ్లు ఆపుతారా? : ఢిల్లీ హైకోర్టు
సాక్షి, ఢిల్లీ: ‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. ‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్-NBF ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. TV9, సాక్షి, 10టీవీ, NTV న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ NBF హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్‌ఛానెల్స్‌ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టిందని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రాత్మకమైనవి NBF అభినందించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పిందని NBF తెలిపింది. ఏపీలో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కేబుల్ ఆపరేటర్లను బెదిరించి ఛానళ్లను నిలిపివేశారని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం చట్టవిరుద్ధమనీ, అలాగే కేబుల్ ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్-NBF గుర్తుచేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటిచెప్పిందని NBF తెలిపింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులను పరిరక్షించడానికి హైకోర్టు ఆదేశం నాంది పలుకుతుంని ఆశిస్తున్నట్లు ఈ సంస్థ వ్యాఖ్యానించింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, స్వతంత్ర మీడియాను ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు NBF అభినందనలు తెలిపింది. ఇక ముందు ఇలా ఛానెల్స్ ప్రసారాల నిలిపివేతలను అడ్డుకోడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF విజ్ఞప్తి చేసింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానెల్స్ పనిచేసే వాతావరణం కల్పించాలని NBF విన్నవించింది. Read More: టీడీపీ ఒత్తిళ్లతో సాక్షి, మరికొన్ని వార్తా ఛానెళ్ల నిలిపివేత -
ఏపీలో సాక్షి ఛానల్ నిలిపివేతపై.. NBDA సీరియస్
-
NBDA : మరోసారి అధ్యక్షుడిగా అవినాష్ పాండే
న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) 2023-2024 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నిక తాజాగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏబీపీ నెట్వర్క్ సీఈవో అవినాష్ పాండే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంశ్ కుమార్ ఎన్బీడీఏ వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఇక న్యూస్24 బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా గౌరవ కోశాధికారిగా కొనసాగనున్నారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్‌ను గతంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌గా పిలిచేవారు. ఇది దేశంలోని వివిధ న్యూస్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ అసోసియేషన్. ఇందులో రజత్ శర్మ, ఎమ్కే ఆనంద్, రాహుల్ జోషి, ఐ వెంకట్, కల్లి పూరీ భండాల్, సోనియా సింగ్, అనిల్ కుమార్ మల్హోత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు. NBDA గురించి న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసొసియేషన్ అనేది ప్రైవేట్ టీవీ ఛానళ్లు, కరెంట్ అఫైర్ ఛానళ్లు, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ల కోసం ఏర్పడిన NBAకి కొత్త రూపం. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని నిర్వహణ పూర్తిగా సభ్యులే నిర్వహించుకుంటారు. ప్రస్తుతం NBDAలో 27 పెద్ద న్యూస్ ఛానళ్లతో పాటు మొత్తమ్మీద 125 న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే వశ్వసనీయమైన సంస్థ NBDA. టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వాక్ స్వతంత్ర హక్కును నిలబెట్టడం, మీడియాకు సంబంధించిన తాజా అంశాలను చర్చించడం, కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుంచడం దీని బాధ్యతలు. తన సభ్యులైన వివిధ టీవీ (న్యూస్, కరెంట్ అఫైర్స్) ఛానళ్లకు సంబంధించిన న్యాయ వివాదాల పరిష్కారంలో NBDA కీలక భూమిక పోషిస్తోంది. -
బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
న్యూఢిల్లీ: వివిధ టీవీ చానళ్లకు చెందిన కొందరు జర్నలిస్టులు/యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు, వేదికలకు తమ ప్రతినిధులను పంపించకూడదని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్(ఎన్బీడీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయం ఆందోళనకరమని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకోవడం సరైంది కాదని పేర్కొంది. గతంలో ఇలాంటి పరిణామం ఎనాడూ సంభవించలేదని గుర్తుచేసింది. ప్రమాదకరమైన ఈ ధోరణిని మానుకోవాలని ఇండియా కూటమికి విజ్ఞప్తి చేసింది. మీడియా స్వేచ్చను గౌరవించాలని కోరింది. కొందరు జర్నలిస్టులను/యాంకర్లను బహిష్కరించడం అనేది దేశాన్ని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) నాటి రోజుల్లోకి తీసుకెళ్తుందని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. మీడియాపై విరుచుకుపడితే స్వతంత్ర భావాల వ్యక్తీకరణను, గొంతుకలను అణచివేసినట్లే అవుతుందని తెలియజేసింది. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమికి సూచించింది. -
ఎన్డీ టీవీకి ఊరట...!
న్యూఢిల్లీ : జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు ప్రసారాలు నిలిపేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీ టీవీపై నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ప్రసారాలు ఒకరోజుపాటు నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకున్న విషయం విదితమే. -
ఎన్డీ టీవీపై చర్యను ఖండించిన ఎన్బీఏ
న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జాతీయ ఛానల్ ఎన్డీ టీవీ ఇండియా ప్రసారాలు నిలిపేయాలన్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఎన్బీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పటాన్ కోట్ దాడిని మిగతా ఛానళ్లు ప్రసారం చేసినా... కేవలం ఎన్డీ టీవీ ఇండియాపైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఎన్డీటీవీ లైవ్ ప్రసారాల వల్ల రక్షణ రహస్యాలు భంగం వాటిల్లిందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.