అత్యవసర పరిస్థితికి ఆహ్వానం? | may emergency days will coming soon | Sakshi
Sakshi News home page

అత్యవసర పరిస్థితికి ఆహ్వానం?

Published Sat, Nov 5 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

అత్యవసర పరిస్థితికి ఆహ్వానం?

అత్యవసర పరిస్థితికి ఆహ్వానం?

జాతిహితం
ఎన్‌డీటీవీపై నిషేధంపై పలు చానళ్ల వైఖరి అత్యవసర పరిస్థితి కాలంలోని మన పత్రికలు చాలా వాటి తీరును గుర్తుకు తెస్తోంది. నాడు మనం మౌనం పాటించి అత్యవసర పరి స్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైన దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదం పైన మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన ఆ గతాన్ని పునరావృతం చేస్తున్నాం.

నేటి ప్రత్యామ్నాయ చరిత్రల కాలంలో రాజకీయ, భావజాల, మేధోపరమైన విభేదాలన్నింటికి అతీతంగా అందరికీ అత్యవసర పరిస్థితిపై ఆమోదయోగ్య  మైన అవగాహన ఉంది. దానికి భిన్నంగా ధ్వనించే మరో అర్థాన్నిచ్చే కథ నాన్ని రచించడం సాధ్యమేనా? అది స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటి కాలం. పాత్రికేయులతోసహా (అప్పట్లో ‘మీడియా’ అని ఎవరూ అన లేదు) ప్రజలలో చాలా మంది దాన్ని సహించడానికి నిరాకరించారు. న్యాయ వ్యవస్థ సైతం ఆ పోరాటంలో చేరింది. ఇవన్నీ కలసి రూపొందిన ఆగ్రహావేశ వెల్లువకు దేవ్‌ కాంత్‌ బారువా ‘‘ఇందిరే ఇండియా’’ అన్న ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్‌గాంధీలుసహా, దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని గొప్ప భజనపరుల మూకంతా చరిత్ర చెత్తబుట్టలోకి కొట్టుకుపోయారు.   

ఆ అత్యవసర పరిస్థితిని గుర్తు చేçసుకుంటూ,  అలా మన స్వేచ్ఛలకు, ప్రజాస్వామ్యానికి తిరిగి ముప్పు ఏర్పడటాన్ని నివారించాలని హెచ్చరించడ మంటే మన ప్రధానికి ఇష్టం. ఈ వారంలో కూడా ఆయన, పాత్రికేయ వృత్తిలో అత్యుత్తమ ప్రతిభకు పురస్కార ప్రధానోత్సవంలో ఇదే విషయాన్ని ఆయన మళ్లీ ప్రస్తావించారు. అత్యవసర పరిస్థితి పట్ల మన మీడియా చూపిన ప్రతిఘటనకు గర్వించదగ్గ చిహ్నంగా నిలిచిన రామ్‌నాథ్‌ గోయెంకా స్మారక పురస్కారాలవి. నలభై ఏళ్ల క్రితమే అత్యవసర పరిస్థితి అంతమైనా, నిరంకు శాధికారం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున ఆ హెచ్చరిక అవసరమైనదే. అయితే, దాదాపుగా ఆ ఉపన్యాసం సాగుతున్నప్పుడే ఎన్‌డీటీవీ హిందీ చానల్‌ ప్రసారాలపై ఒక రోజు నిషేధాన్ని ప్రకటించారు. పఠాన్‌కోట్‌ ఉగ్ర వాద దాడి లైవ్‌ కవరేజీ విషయంలో ఆ చానల్‌ వ్యవస్థీకృతమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ దానికి ఆ శిక్ష విధించారు.

మీడియాపై కొత్త నిషేధాల కొరడా
ప్రధాని ఉపన్యాసం, ఆ నిషేధ ఉత్తర్వులూ, రెండూ పూర్తిగా కాకతాళీ యమే అనుకుందాం. సమాచార మంత్రిత్వశాఖ వీసీ శుక్ల హయాంలో అత్యవ సర పరిస్థితిలో పత్రికలపై ముందస్తు సెన్సార్‌షిప్‌ను ప్రకటించిన తర్వాత మొదటి సారిగా ఒక ప్ర«ముఖ వార్తా చానల్‌పై నిషేధాస్త్రాన్ని ప్రకటించడానికి ముందు అంతకంటే మెరుగైన చర్య ఏమైనా ఉందేమోనని ఆలోచించాల్సింది. కానీ ఇది భారత ప్రభుత్వం, కాబట్టి ఇలాంటివి జరగడం మామూలే. అత్యవసర పరిస్థితి వంటి ముప్పునకు వ్యతిరేకంగా ప్రధాని మనల్ని జాగ రూకుల్ని చేసిన  కథనం అచ్చవుతుండగానే... మాననీయ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) ఎన్‌డీటీవీపై విధించిన నిషేధాన్ని ఖండిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఈజీఐకి ‘‘మాననీయ’’ అనే విశేషణాన్ని వాడటానికి రెండు కారణా లున్నాయి. ఒకటి, ఏళ్లు గడిచే కొద్దీ పత్రికల యజమానులు సంపాదకీయ బాధ్యతలలోకి  ప్రవేశించడమో లేదా ‘‘అణకువ’’గా ఉండే సంపాదకులు కావాలని కోరుకోవడమో చేస్తున్నారు. రెండు, ఈజీఐ ఉపయోగించిన భాష. గతంలో అది, నిరసన తెలిపేటప్పుడు కూడా పాత తరహా సంపాదకీయం లాగా నిగ్రహంగా, ఆచితూచినదిగా ఉండేది. తాజా ఖండన తుపాకీ మందులో ముంచిన మిరపకాయలా ఉంది.

పాత్రికేయులం అయిన ఒక్క కారణం వల్ల మనం అత్యవసర పరిస్థితిని ప్రధానంగా మనల్ని వేధించడంగా, ఉత్తేజకరమైన రీతిలో మనం దాని పట్ల చూపిన ప్రతిఘటనగా నిర్వచిస్తాం. ఇందులో రెండో దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చరిత్రను తడమడం సముచితం. వంగమని అంటే భారత పాత్రికేయలోకం పాకిందంటూ ఎల్‌కే అద్వానీ ఆ విషయంపై అజరామ రమైన, సమంజసమైన వ్యాఖ్య చేశారు. మన పాత్రికేయులు ఎలాంటి పోరా టాన్నీ చేయలేదు లేదా ఆత్మసై్థర్యాన్ని ప్రదర్శించలేదనేది విచారకర వాస్తవం. గొయెంకా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఇరానీ స్టేట్స్‌మేన్, అన్నిట్లోకి అత్యంత ధైర్యాన్ని చూపిన రాజ్‌మోహన్‌గాంధీ హిమ్మత్‌ పత్రిక వంటివి అందుకు మినహాయింపు. జాతీయ పత్రికల పట్ల శత్రువైఖరి చేపట్టిన ఇందిఎరాగాంధీ ఝూట్‌ (అబద్ధాలకోరు) ప్రెస్‌ అనేవారు.

ప్రధానంగా ద్రవ్యోల్బణం 25%కి పైగా పెరిగిపోవడమూ, ప్రజలలో ఆమె పట్ల భ్రమలు తొలగడమూ కలసి బంగ్లాదేశ్‌ యుద్ధం వల్ల ఆమెకు కలిగిన  ప్రాభవాన్ని మసకబరిచాయి. 1974 పోఖ్రాన్‌ అణు విస్ఫోటనం సైతం ఆ అసంతృప్తిని చల్లార్చలేకపోయింది. అత్యవసర పరిస్థితిలో మొట్టమొదట ఆమె ఆగ్రహానికి లక్ష్యంగా మారిన సుప్రసిద్ధ సంపాదకులు బీజీ వర్గీస్‌. అత్యవసర పరిస్థితి విధించిన మూడు నెల్లకు ఆయనకు ఉద్వాసన పలికారు. అంతకు ఏడాది ముందే ఆయన సిక్కిం విలీనాన్ని దురాక్రమణగా పేర్కొంటూ తన సంతకంతో ఒక సంపాదకీ యాన్ని వెలువరించారు. ఆ వెంటనే ఆయన్ను దేశవ్యతిరేకి అన్నారు. ఆయన తోటివారిలో అత్యధికులు ఆయనకు సమర్థనగా నిలవలేదు. వాక్‌ స్వాతం త్య్రం మంచిదే. కానీ అత్యున్నత జాతీయ ప్రయోజనాల రీత్యా సిక్కిం విలీ నాన్ని మీరు ప్రశ్నించడం సరైనదేనా? అనే వైఖరి చేపట్టారు. ఆయన సొంత పత్రిక పాత్రికేయులు అందుకు మినహాయింపు.

‘జాతీయ ప్రయోజనం’ నోటికి తాళం
నేడు ఎన్‌డీటీవీపై నిషే«ధానికి వ్యతిరేకంగా పోరాడటంలో కూడా అలాంటి సందిగ్ధమే కనబడుతోంది. ఎక్కువగా ప్రింట్‌ మీడియా లేదా ‘‘ప్రెస్‌’’ అని పిలిచే దానితో కూడిన ఎడిటర్స్‌ గిల్డ్‌ నిరసన తెలిపింది. కాగా,  చాలా ప్రధాన టీవీ చానళ్లు తిరిగి మళ్లీ అదే జాతీయ ప్రయోజన సూత్రాన్ని పఠిస్తూ నిరసన తెలుపలేదు. టీఆర్‌పీ రేటింగ్‌లను ఆరాధిస్తూ, తామే సరైనవారమని అహంక రించే ఈ అతి దేశభక్త చానళ్లు... భోపాల్‌ ఎన్‌కౌంటర్‌ కథనాన్ని పూర్తిగా విస్మరించేలా చాలా మందిని ఒప్పించాయి. ఇక ఆ ఘటనపై సరైన విచారణ జరిపించాలని అవి కోరడం సంగతి చెప్పనవసరమే లేదు. దేశభక్తి అనే ఈ భావనే ఉడీ ఉగ్రదాడిని, ఆ తదుపరి ఘటనలను ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గొప్పగా ప్రచారం చేసుకుంటునే ఉన్నా... వాటి వివరాలను అడగ కుండా మనల్ని భయపెడు తోంది.

వాస్తవాధీన రేఖ వద్ద నిత్యం జరుగుతున్న ప్రాణనష్టంపై ఏక పక్షమైనదిగా ఉంటోంది. మోదీ ప్రభుత్వానికి ఒక నూతన సిద్ధాంతం ఉన్నదని మనం గుర్తిస్తున్నాం. కానీ దానిలోని శ్రేష్టమైన అంశాలపై నైనా ‘‘వాంఛనీయమైన’’ చర్చ అవసరమని పరిగణించడం లేదు. ఐదు ప్రభుత్వాలు మారినా నిలిచిన వ్యూహాత్మక సంయమనం స్థానే ఇప్పుడు మోదీ–దోవల్‌ సిద్ధాంతం ప్రవేశించింది. దీన్ని ప్రశ్నించడం కాదు, చర్చించడ మైనా కూడా జాతీయ ప్రయోజనాలుగా చెప్పేవాటి రీత్యా తగని పని. శ్రోత లకు, ప్రజలకు, మార్కెట్‌కు సైతం కావాల్సింది ఊపిరి సలపని ప్రశంసలే తప్ప, ఇవేవీ అవసరం లేదు. యుద్ధం సాగిస్తున్న చానళ్లకు విరుద్ధంగా, అవస రమైన చోట కాస్త ఆగి, వాస్తవాల కోసం అన్వేషిస్తూ ప్రశ్నలు లేవనెత్తే చానళ్ల రేటింగ్స్‌లోని తేడాలో ఇది కనిపిస్తుంది.

ఇందిరా గాంధీ కూడా అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాతా దానికి సమర్థనగా ఇదే అతి జాతీయవాదాన్ని వాడారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమానికి వెనుక విదేశీ హస్తానికి ఆధారాలుగా పొరుగునున్న బంగ్లాదేశ్‌లో షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్, దూరంగా చిలీలో సాల్వడార్‌ అలెండీల హత్యలను చూపారు. ఆ సాకుతో ఆ ఉద్యమంపై విరుచుకు పడ్డారు. ఆ సమయంలో దేశం అప్పుడే గొప్ప సైనిక విజయాన్ని సాధించి పాక్‌ రెండు ముక్కలయ్యేలా చేసింది. నక్సలైట్‌ ఉద్యమాన్ని అణచివేసింది, బాహ్య అంతర్గత ముçప్పులు 1947 తర్వాత అతి అల్పస్థాయిలో ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా జాతీయ ఉన్మాదాన్ని కుహనా సోషలిజాన్ని మొరటుగా కలగలిపారు. ఎమ ర్జెన్సీ కాలంలో బస్సులపై మెరిసిన అప్రతిష్టాకరమైన నినాదాల్లో కెల్లా నాకు ఇష్టమైనది ‘‘పుకార్లు రేపేవారి పట్ల జాగ్రత్త వహించండి’’. మరింత సూటిగా చదివితే దానర్థం చేదు వాస్తవాలను చెప్పేవారిని తప్పు పట్టండి అని.

మరోసారి అదే తప్పు చేద్దామా?
నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారతం ఈ ఫాసిస్టు చెత్తను నమ్మిందా? లేక వాటి వెనుక వాస్తవాలను చూసి, తిప్పికొట్టి, తన స్వేచ్ఛలను పునరుద్ధరించు కుందా? తర్వాతి చరిత్ర రెండోదే జరిగిందని చెబుతున్నా అది కథనంలోని ఒక భాగమే. అనామక పేద ప్రజా బాహుళ్యంపై బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నాటి పాలకులు పాల్పడంతో ఉత్తర భారతం ఆగ్ర హంతో రగిలేవరకు ఉన్నత, మధ్య తరగతి వర్గాలు తమ స్వేచ్ఛలను కొంత కోల్పోవడాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ 1977 ఎన్నికల ఫలితాలు ఏమ య్యాయి? బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన ఉత్తర భార తంలో ఇందిరాగాంధీ తుడిచిపెట్టుకుపోగా, అవి జరగని దక్షిణాదిలో ఘన విజయం సాధించారు. ఇది ఏం తెలియజేస్తోంది? ఉన్నత, మధ్య తరగతి వర్గాల వారు స్వేచ్ఛ గురించి పట్టించుకోరని చెప్పడం మరీ అతిశయీకరించడమే అవుతుంది.

వారెప్పుడూ, అది నా కోసమా, అయితే చెల్లించాల్సిన మూల్యం ఎంత? అని లాభనష్టాలను బేరీజు వేసి చూస్తారు. ఆ మేరకు మనం గత 40 ఏళ్లలో మారలేదు. పత్రికలు మౌనం పాటించినందున మనం, పాత్రికేయులం 1975-77 కాలం నాటి అత్యవసర పరిస్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైనా దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదంపైన  మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన గతాన్ని పునరావృతం చేస్తున్నాం.

నేడున్న ప్రమాదాలు నాటికంటే పెద్దవి. ఒకటి, బహిర్గత శత్రువు చాలా తేలికగా కనిపిస్తున్నాడు. రెండు, బాగా పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున అసంతృప్తిని దూరంగా ఉంచుతోంది. మూడు, చాలాకాలంగా స్థిరంగా నిలి చిన సామాజిక–రాజకీయ శక్తులు తమ మౌలిక విశ్వాసాలను కోల్పోయి, వాటికి బదులుగా టీఆర్‌పీ రేట్ల ద్వారా, ప్రజాభిప్రాయాన్ని తయారు చేయ డం ద్వారా తమ రాజకీయాలను సాగిస్తున్నాయి. నేడు స్పష్టమైన ఆలోచ నలతో సువిశాల జాతీయవాద సామాజిక రాజకీయ నిర్మాణాన్ని కలిగిన ఏకైక శక్తి దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక్కటే. అది నాటి అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటాన్ని నడిపింది. నేడు అది అధికార వ్యవస్థకు నేతృత్వం వహిస్తోంది.

శేఖర్‌ గుప్తా,
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement