Restrictions on media
-
మీడియాపై ఆంక్షలు సబబా?
ప్రధాన న్యాయమూర్తి సహా అన్ని కోర్టుల కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని మన న్యాయవ్యవస్థ ప్రజలకు కల్పించింది. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయత తగ్గుతుంది. న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచా రణ హక్కు ఉండటం వల్ల న్యాయపాలన ఎలా జరుగు తుందో, నిర్ణయాలు ఎలా జరుగుతాయో ప్రజలకు తెలుస్తుంది. మన దేశంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విచారణలు బహిరంగంగానే జరుగుతాయి. ఈ బహి రంగ విచారణల వల్ల ప్రజల్లో కోర్టుల పట్ల విశ్వసనీ యత పెరుగుతుంది. బహిరంగ విచారణలను వీక్షించి, ప్రచురించే అవకాశం మీడియాకు ఉంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టులు జారీ చేస్తున్న ఉత్తర్వుల వల్ల కోర్టు కార్యకలాపాలను ప్రచురించే అవకాశాన్ని మీడియా కోల్పోతుంది. ఇవి, ఒక రకంగా బహిరంగ విచారణలకి వ్యతిరేకమైన ఉత్తర్వులని అనుకోవచ్చు. కోర్టుల కార్య కలాపాల్లో ఉన్నంత పారదర్శకత ఏ వ్యవస్థలోనూ కన్పించదు. ఇది న్యాయ వ్యవస్థకు ఉన్న విశిష్ట లక్షణం. ఈ విశిష్టత బీటలు వారుతున్నట్టు అనిపిస్తుంది. సోహ్రాబుద్దీన్ షేక్ కేసును విచారిస్తున్న సీబీఐ న్యాయమూర్తి ఆ విచారణకు సంబంధించిన విషయా లను ప్రచురించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా రిపోర్టుల వల్ల విచారణకు అంతరాయం కలు గుతుంది, ముద్దాయిల ప్రాణాలకు నష్టం వాటిల్లు తుంది అన్న డిఫెన్స్ వాదనలను అంగీకరిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ ముఖ్యమంత్రిపై కేసు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు నవంబర్ 7న ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. వీటి కంటే ముందే సుప్రీంకోర్టు ఈ ఏడాది మొదట్లో దాదాపు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. న్యాయమూర్తి కర్ణ న్కు కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధిస్తూ అది ఆయన ప్రకటనలను ఏ పత్రిక ప్రచురించకూడదంటూ మీడి యాపై ఆంక్షలను విధించింది. ఈ ఉత్తర్వులు మిగతా కోర్టులను కూడా ప్రభావితం చేశాయని అనుకోవచ్చు. చాలా కేసుల్లో మీడియా కాపలా కుక్కలా పని చేస్తుంది. విచారణలో ఉన్న వ్యక్తులకు హాని కలగకుండా మీడియా కేసు వార్తలను ప్రచురించాల్సి ఉంటుంది. హాని కలిగించే విధంగా ప్రచురించినప్పుడు ఆ మీడియా సంస్థపై చర్య తీసుకునే అధికారం కోర్టులకు ఉంది. అయినా మీడియా గొంతు నొక్కడం ఎంతవరకు సమం జసం అన్న వాదన వినిపిస్తోంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారమేగాక అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం ప్రతి వ్యక్తికి బహిరంగ విచారణ హక్కులు ఉంటాయి. బహిరంగ విచారణలు జరపడం అనేది నియమం లాంటిది. ఈ నియమానికి మినహాయింపులు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది. విచారణకు మొత్తంగా ప్రజలందరిని దూరంగా ఉంచాలా, ప్రత్యే కించి ఎవరిని దూరంగా ఉంచాలి అన్న విషయాలు సంబంధిత కోర్టుని బట్టి, ఆ వ్యవహారం తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే కోర్టు కార్యకలాపాలను కొంత కాలం కానీ, పూర్తిగా కానీ పత్రికలు ప్రచురించరాదని ఆదేశించే అధికారం కోర్టుకు ఉంటాయి. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్ సెక్షన్ 327 ప్రకారం క్రిమినల్ కోర్టులకు ఈ అధికారం ఉంటుంది. సివిల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి ప్రత్యేక నిబంధన లేదు. కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 ప్రకారం సివిల్ కోర్టుకు స్వయంసిద్ధ అధికా రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో ఎవరినైనా బయటికి పంపించే అధికారం కోర్టుకు ఉంటుంది. అధికారం ఉండడం ఒక ఎత్తు, దానిని న్యాయబద్ధంగా ఉపయోగించడం మరొక ఎత్తు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కోర్టులు తమ అధికారాలను వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ విచారణలనేవి ఆరోగ్యకరమైన, నిష్పా క్షిక న్యాయపాలనకు పునాది లాంటివి. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటానికి న్యాయమూర్తులు చపలత్వా నికి లోనుకాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడు తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భావాలను ప్రకటించిన తర్వాత, అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ముందుగానే భావ ప్రక టనను నిరోధించడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిం చేది అవుతుందని అనుకోవచ్చు. 1950లో సుప్రీంకోర్టు, బ్రిజ్‌భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో బ్రిటిష్ న్యాయ కోవిదుడు బ్లాక్ స్టోన్ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ పత్రికా స్వేచ్ఛ గురించి ఇలా అభిప్రాయపడింది. ‘‘ప్రచురించడానికన్నా ముందే పత్రి కపై పరిమితులు విధించకూడదు. ఈ స్వేచ్ఛ ఇచ్చి నంత మాత్రాన తప్పుడు రాతలపై చర్యలు తీసు కోవద్దని కాదు’’. ఇప్పుడు కోర్టులు ఇస్తున్న ఉత్తర్వుల వల్ల ప్రచురణకన్నా ముందే పత్రికలపై పరిమితులను విధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిష్పాక్షిక విచారణ కోసం కోర్టులు ఈ పరిమి తులను విధించవచ్చు. అయితే బహిరంగ విచారణల వల్ల, కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల కోర్టుల పట్ల ప్రజల విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ప్రధాన న్యాయ మూర్తి కోర్టు కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని కూడా కోర్టులు కల్పించాయి. మిగతా వ్యవస్థల కన్నా భిన్నంగా ఈ హక్కుని కోర్టులు ప్రజలకి ఇచ్చాయి. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు వున్న విశ్వసనీయత తగ్గుతుంది. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని కోర్టులు పరిమితులని విధిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. - మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ‘ మొబైల్ : 94404 83001 -
బెర్లిన్‌లో భౌతిక గోడైతే భారత్‌లో అదృశ్య గోడ
న్యూఢిల్లీ : ఎన్డీటీవీ హిందీ ఛానల్ ప్రసారాలను బుధవారం ఒక రోజు నిలిపివేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను పునర్ సమీక్షిస్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే అంశమే. రేపు బుధవారంకున్న ప్రాముఖ్యత ప్రభుత్వానికి తెలియకపోవచ్చుగానీ, మీడియా పీపుల్‌కు మాత్రం అది ముఖ్యమైన రోజు. బుధవారం నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈ ఫలితాల ప్రభావం భారత్‌పైనా, మొత్తం ప్రపంచంపై ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను నిర్వహించడంతోపాటు వివిధ కోణాల నుంచి ఫలితాలను విశ్లేషించి, చర్చాగోష్ఠులను నిర్వహించడం రేపు ఏ టీవీ ఛానల్ మనుగడకైనా ముఖ్యమే. భారత్ మీడియాలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు విస్తత కవరేజ్ వచ్చినందున రేపు యాడ్స్, యాడ్స్ టారిప్‌లు ఛానళ్లకు పెరిగే అవకాశం కూడా ఉంది. నవంబర్ 9వ తేదీ (1989)....మరో చరిత్రాత్మకమైన రోజు. తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య బెర్లిన్‌వాల్‌ను కూల్చేసిన రోజు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి ప్రజలెవరూ వెళ్లకుండా నిర్మించినది బెర్లిన్ గోడ. గోడ కూల్చివేతకు ముందు అక్కడి సమాచార వ్యవస్థపై, ప్రభుత్వ వైఖరిని విమర్శించే వర్గాలపై ఎంతో అణచివేత, ఎన్నో ఆంక్షలు ఉండేవి. భారత్‌లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా గత 29 నెలలుగా అలాంటి గోడనే నిర్మిస్తోంది. బెర్లిన్ గోడ భౌతికమైనదైతే మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నది అదృశ్య గోడ. అక్కడ అధికారంలో ఉండింది లెఫ్ట్‌వింగ్ ప్రభుత్వంకాగా, భారత్‌లో రైట్‌వింగ్ ప్రభుత్వం కొనసాగుతోంది. వామపక్షాలు, అంబేద్కర్‌వాదులు, ఉదారవాదులు, మధ్యంతరవాదులు, లౌకికవాదులు, గోమాంస భక్షకులు, లవ్ జిహాదులకు, హిందూత్వవాదులకు మధ్యన ఈ కనిపించని గోడను మోదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. గోవధ నిషేధాలను, గోమాంస భక్షకుల పేరిట దళితులపై జరుగుతున్న దాడులను, హిందూత్వ మూలాలను ప్రశ్నించిన హేతువాదుల హత్యలనుప్రస్తావించరాదు. హిందూత్వాన్ని పూసుకున్న, మోస్తున్న బీజీపీ శక్తులను అసలు విమర్శించరాదు. అలా చేస్తున్న మీడియా గ్రూపులకు నరేంద్ర మోదీగారు ‘న్యూస్ ట్రేడర్స్’ అని పేరు కూడా పెట్టారు. మరో బీజేపీ సీనియర్ నాయకుడు తన నాలుకకు మరింత పదునుపెట్టి ‘ప్రెస్టిట్యూట్స్’ అని కూడా తిట్టిపోశారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పటేళ్లు, హర్యానాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను, తమ హక్కుల సాధన కోసం పోరాడుతున్న దళితులు, ఆదివాసుల ఉద్యమాల ఊసెత్తకుండా తమ పాలనలో భారతీయులు ఎంతగానో సుఖ పడుతున్నారని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని, హ్యాపి నేషన్ అంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారాన్ని, కాశ్మీర్‌తోపాటు దేశంలోని అన్ని సమస్యలకు పాకిస్తాన్ కారణమనే నినాదాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళితే మోదీ ప్రభుత్వం సంతోషిస్తోందేమో! ఇప్పటికే తలవరకు వచ్చిన అదృశ్యగోడను త్వరగా పూర్తి చేస్తుందేమో!! --- ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
అత్యవసర పరిస్థితికి ఆహ్వానం?
జాతిహితం ఎన్డీటీవీపై నిషేధంపై పలు చానళ్ల వైఖరి అత్యవసర పరిస్థితి కాలంలోని మన పత్రికలు చాలా వాటి తీరును గుర్తుకు తెస్తోంది. నాడు మనం మౌనం పాటించి అత్యవసర పరి స్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైన దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదం పైన మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన ఆ గతాన్ని పునరావృతం చేస్తున్నాం. నేటి ప్రత్యామ్నాయ చరిత్రల కాలంలో రాజకీయ, భావజాల, మేధోపరమైన విభేదాలన్నింటికి అతీతంగా అందరికీ అత్యవసర పరిస్థితిపై ఆమోదయోగ్య మైన అవగాహన ఉంది. దానికి భిన్నంగా ధ్వనించే మరో అర్థాన్నిచ్చే కథ నాన్ని రచించడం సాధ్యమేనా? అది స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటి కాలం. పాత్రికేయులతోసహా (అప్పట్లో ‘మీడియా’ అని ఎవరూ అన లేదు) ప్రజలలో చాలా మంది దాన్ని సహించడానికి నిరాకరించారు. న్యాయ వ్యవస్థ సైతం ఆ పోరాటంలో చేరింది. ఇవన్నీ కలసి రూపొందిన ఆగ్రహావేశ వెల్లువకు దేవ్ కాంత్ బారువా ‘‘ఇందిరే ఇండియా’’ అన్న ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్గాంధీలుసహా, దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని గొప్ప భజనపరుల మూకంతా చరిత్ర చెత్తబుట్టలోకి కొట్టుకుపోయారు. ఆ అత్యవసర పరిస్థితిని గుర్తు చేçసుకుంటూ, అలా మన స్వేచ్ఛలకు, ప్రజాస్వామ్యానికి తిరిగి ముప్పు ఏర్పడటాన్ని నివారించాలని హెచ్చరించడ మంటే మన ప్రధానికి ఇష్టం. ఈ వారంలో కూడా ఆయన, పాత్రికేయ వృత్తిలో అత్యుత్తమ ప్రతిభకు పురస్కార ప్రధానోత్సవంలో ఇదే విషయాన్ని ఆయన మళ్లీ ప్రస్తావించారు. అత్యవసర పరిస్థితి పట్ల మన మీడియా చూపిన ప్రతిఘటనకు గర్వించదగ్గ చిహ్నంగా నిలిచిన రామ్‌నాథ్ గోయెంకా స్మారక పురస్కారాలవి. నలభై ఏళ్ల క్రితమే అత్యవసర పరిస్థితి అంతమైనా, నిరంకు శాధికారం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున ఆ హెచ్చరిక అవసరమైనదే. అయితే, దాదాపుగా ఆ ఉపన్యాసం సాగుతున్నప్పుడే ఎన్డీటీవీ హిందీ చానల్ ప్రసారాలపై ఒక రోజు నిషేధాన్ని ప్రకటించారు. పఠాన్‌కోట్ ఉగ్ర వాద దాడి లైవ్ కవరేజీ విషయంలో ఆ చానల్ వ్యవస్థీకృతమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ దానికి ఆ శిక్ష విధించారు. మీడియాపై కొత్త నిషేధాల కొరడా ప్రధాని ఉపన్యాసం, ఆ నిషేధ ఉత్తర్వులూ, రెండూ పూర్తిగా కాకతాళీ యమే అనుకుందాం. సమాచార మంత్రిత్వశాఖ వీసీ శుక్ల హయాంలో అత్యవ సర పరిస్థితిలో పత్రికలపై ముందస్తు సెన్సార్షిప్ను ప్రకటించిన తర్వాత మొదటి సారిగా ఒక ప్ర«ముఖ వార్తా చానల్‌పై నిషేధాస్త్రాన్ని ప్రకటించడానికి ముందు అంతకంటే మెరుగైన చర్య ఏమైనా ఉందేమోనని ఆలోచించాల్సింది. కానీ ఇది భారత ప్రభుత్వం, కాబట్టి ఇలాంటివి జరగడం మామూలే. అత్యవసర పరిస్థితి వంటి ముప్పునకు వ్యతిరేకంగా ప్రధాని మనల్ని జాగ రూకుల్ని చేసిన కథనం అచ్చవుతుండగానే... మాననీయ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) ఎన్డీటీవీపై విధించిన నిషేధాన్ని ఖండిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఈజీఐకి ‘‘మాననీయ’’ అనే విశేషణాన్ని వాడటానికి రెండు కారణా లున్నాయి. ఒకటి, ఏళ్లు గడిచే కొద్దీ పత్రికల యజమానులు సంపాదకీయ బాధ్యతలలోకి ప్రవేశించడమో లేదా ‘‘అణకువ’’గా ఉండే సంపాదకులు కావాలని కోరుకోవడమో చేస్తున్నారు. రెండు, ఈజీఐ ఉపయోగించిన భాష. గతంలో అది, నిరసన తెలిపేటప్పుడు కూడా పాత తరహా సంపాదకీయం లాగా నిగ్రహంగా, ఆచితూచినదిగా ఉండేది. తాజా ఖండన తుపాకీ మందులో ముంచిన మిరపకాయలా ఉంది. పాత్రికేయులం అయిన ఒక్క కారణం వల్ల మనం అత్యవసర పరిస్థితిని ప్రధానంగా మనల్ని వేధించడంగా, ఉత్తేజకరమైన రీతిలో మనం దాని పట్ల చూపిన ప్రతిఘటనగా నిర్వచిస్తాం. ఇందులో రెండో దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చరిత్రను తడమడం సముచితం. వంగమని అంటే భారత పాత్రికేయలోకం పాకిందంటూ ఎల్కే అద్వానీ ఆ విషయంపై అజరామ రమైన, సమంజసమైన వ్యాఖ్య చేశారు. మన పాత్రికేయులు ఎలాంటి పోరా టాన్నీ చేయలేదు లేదా ఆత్మసై్థర్యాన్ని ప్రదర్శించలేదనేది విచారకర వాస్తవం. గొయెంకా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇరానీ స్టేట్స్‌మేన్, అన్నిట్లోకి అత్యంత ధైర్యాన్ని చూపిన రాజ్‌మోహన్‌గాంధీ హిమ్మత్ పత్రిక వంటివి అందుకు మినహాయింపు. జాతీయ పత్రికల పట్ల శత్రువైఖరి చేపట్టిన ఇందిఎరాగాంధీ ఝూట్ (అబద్ధాలకోరు) ప్రెస్ అనేవారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం 25%కి పైగా పెరిగిపోవడమూ, ప్రజలలో ఆమె పట్ల భ్రమలు తొలగడమూ కలసి బంగ్లాదేశ్ యుద్ధం వల్ల ఆమెకు కలిగిన ప్రాభవాన్ని మసకబరిచాయి. 1974 పోఖ్రాన్ అణు విస్ఫోటనం సైతం ఆ అసంతృప్తిని చల్లార్చలేకపోయింది. అత్యవసర పరిస్థితిలో మొట్టమొదట ఆమె ఆగ్రహానికి లక్ష్యంగా మారిన సుప్రసిద్ధ సంపాదకులు బీజీ వర్గీస్. అత్యవసర పరిస్థితి విధించిన మూడు నెల్లకు ఆయనకు ఉద్వాసన పలికారు. అంతకు ఏడాది ముందే ఆయన సిక్కిం విలీనాన్ని దురాక్రమణగా పేర్కొంటూ తన సంతకంతో ఒక సంపాదకీ యాన్ని వెలువరించారు. ఆ వెంటనే ఆయన్ను దేశవ్యతిరేకి అన్నారు. ఆయన తోటివారిలో అత్యధికులు ఆయనకు సమర్థనగా నిలవలేదు. వాక్ స్వాతం త్య్రం మంచిదే. కానీ అత్యున్నత జాతీయ ప్రయోజనాల రీత్యా సిక్కిం విలీ నాన్ని మీరు ప్రశ్నించడం సరైనదేనా? అనే వైఖరి చేపట్టారు. ఆయన సొంత పత్రిక పాత్రికేయులు అందుకు మినహాయింపు. ‘జాతీయ ప్రయోజనం’ నోటికి తాళం నేడు ఎన్డీటీవీపై నిషే«ధానికి వ్యతిరేకంగా పోరాడటంలో కూడా అలాంటి సందిగ్ధమే కనబడుతోంది. ఎక్కువగా ప్రింట్ మీడియా లేదా ‘‘ప్రెస్’’ అని పిలిచే దానితో కూడిన ఎడిటర్స్ గిల్డ్ నిరసన తెలిపింది. కాగా, చాలా ప్రధాన టీవీ చానళ్లు తిరిగి మళ్లీ అదే జాతీయ ప్రయోజన సూత్రాన్ని పఠిస్తూ నిరసన తెలుపలేదు. టీఆర్పీ రేటింగ్లను ఆరాధిస్తూ, తామే సరైనవారమని అహంక రించే ఈ అతి దేశభక్త చానళ్లు... భోపాల్ ఎన్కౌంటర్ కథనాన్ని పూర్తిగా విస్మరించేలా చాలా మందిని ఒప్పించాయి. ఇక ఆ ఘటనపై సరైన విచారణ జరిపించాలని అవి కోరడం సంగతి చెప్పనవసరమే లేదు. దేశభక్తి అనే ఈ భావనే ఉడీ ఉగ్రదాడిని, ఆ తదుపరి ఘటనలను ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గొప్పగా ప్రచారం చేసుకుంటునే ఉన్నా... వాటి వివరాలను అడగ కుండా మనల్ని భయపెడు తోంది. వాస్తవాధీన రేఖ వద్ద నిత్యం జరుగుతున్న ప్రాణనష్టంపై ఏక పక్షమైనదిగా ఉంటోంది. మోదీ ప్రభుత్వానికి ఒక నూతన సిద్ధాంతం ఉన్నదని మనం గుర్తిస్తున్నాం. కానీ దానిలోని శ్రేష్టమైన అంశాలపై నైనా ‘‘వాంఛనీయమైన’’ చర్చ అవసరమని పరిగణించడం లేదు. ఐదు ప్రభుత్వాలు మారినా నిలిచిన వ్యూహాత్మక సంయమనం స్థానే ఇప్పుడు మోదీ–దోవల్ సిద్ధాంతం ప్రవేశించింది. దీన్ని ప్రశ్నించడం కాదు, చర్చించడ మైనా కూడా జాతీయ ప్రయోజనాలుగా చెప్పేవాటి రీత్యా తగని పని. శ్రోత లకు, ప్రజలకు, మార్కెట్‌కు సైతం కావాల్సింది ఊపిరి సలపని ప్రశంసలే తప్ప, ఇవేవీ అవసరం లేదు. యుద్ధం సాగిస్తున్న చానళ్లకు విరుద్ధంగా, అవస రమైన చోట కాస్త ఆగి, వాస్తవాల కోసం అన్వేషిస్తూ ప్రశ్నలు లేవనెత్తే చానళ్ల రేటింగ్స్‌లోని తేడాలో ఇది కనిపిస్తుంది. ఇందిరా గాంధీ కూడా అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాతా దానికి సమర్థనగా ఇదే అతి జాతీయవాదాన్ని వాడారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి వెనుక విదేశీ హస్తానికి ఆధారాలుగా పొరుగునున్న బంగ్లాదేశ్‌లో షేక్ ముజిబుర్ రెహ్మాన్, దూరంగా చిలీలో సాల్వడార్ అలెండీల హత్యలను చూపారు. ఆ సాకుతో ఆ ఉద్యమంపై విరుచుకు పడ్డారు. ఆ సమయంలో దేశం అప్పుడే గొప్ప సైనిక విజయాన్ని సాధించి పాక్ రెండు ముక్కలయ్యేలా చేసింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసింది, బాహ్య అంతర్గత ముçప్పులు 1947 తర్వాత అతి అల్పస్థాయిలో ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా జాతీయ ఉన్మాదాన్ని కుహనా సోషలిజాన్ని మొరటుగా కలగలిపారు. ఎమ ర్జెన్సీ కాలంలో బస్సులపై మెరిసిన అప్రతిష్టాకరమైన నినాదాల్లో కెల్లా నాకు ఇష్టమైనది ‘‘పుకార్లు రేపేవారి పట్ల జాగ్రత్త వహించండి’’. మరింత సూటిగా చదివితే దానర్థం చేదు వాస్తవాలను చెప్పేవారిని తప్పు పట్టండి అని. మరోసారి అదే తప్పు చేద్దామా? నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారతం ఈ ఫాసిస్టు చెత్తను నమ్మిందా? లేక వాటి వెనుక వాస్తవాలను చూసి, తిప్పికొట్టి, తన స్వేచ్ఛలను పునరుద్ధరించు కుందా? తర్వాతి చరిత్ర రెండోదే జరిగిందని చెబుతున్నా అది కథనంలోని ఒక భాగమే. అనామక పేద ప్రజా బాహుళ్యంపై బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నాటి పాలకులు పాల్పడంతో ఉత్తర భారతం ఆగ్ర హంతో రగిలేవరకు ఉన్నత, మధ్య తరగతి వర్గాలు తమ స్వేచ్ఛలను కొంత కోల్పోవడాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ 1977 ఎన్నికల ఫలితాలు ఏమ య్యాయి? బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన ఉత్తర భార తంలో ఇందిరాగాంధీ తుడిచిపెట్టుకుపోగా, అవి జరగని దక్షిణాదిలో ఘన విజయం సాధించారు. ఇది ఏం తెలియజేస్తోంది? ఉన్నత, మధ్య తరగతి వర్గాల వారు స్వేచ్ఛ గురించి పట్టించుకోరని చెప్పడం మరీ అతిశయీకరించడమే అవుతుంది. వారెప్పుడూ, అది నా కోసమా, అయితే చెల్లించాల్సిన మూల్యం ఎంత? అని లాభనష్టాలను బేరీజు వేసి చూస్తారు. ఆ మేరకు మనం గత 40 ఏళ్లలో మారలేదు. పత్రికలు మౌనం పాటించినందున మనం, పాత్రికేయులం 1975-77 కాలం నాటి అత్యవసర పరిస్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైనా దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదంపైన మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన గతాన్ని పునరావృతం చేస్తున్నాం. నేడున్న ప్రమాదాలు నాటికంటే పెద్దవి. ఒకటి, బహిర్గత శత్రువు చాలా తేలికగా కనిపిస్తున్నాడు. రెండు, బాగా పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున అసంతృప్తిని దూరంగా ఉంచుతోంది. మూడు, చాలాకాలంగా స్థిరంగా నిలి చిన సామాజిక–రాజకీయ శక్తులు తమ మౌలిక విశ్వాసాలను కోల్పోయి, వాటికి బదులుగా టీఆర్పీ రేట్ల ద్వారా, ప్రజాభిప్రాయాన్ని తయారు చేయ డం ద్వారా తమ రాజకీయాలను సాగిస్తున్నాయి. నేడు స్పష్టమైన ఆలోచ నలతో సువిశాల జాతీయవాద సామాజిక రాజకీయ నిర్మాణాన్ని కలిగిన ఏకైక శక్తి దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక్కటే. అది నాటి అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటాన్ని నడిపింది. నేడు అది అధికార వ్యవస్థకు నేతృత్వం వహిస్తోంది. శేఖర్ గుప్తా, twitter@shekargupta -
మీడియాతో ఢీ
♦ ‘స్థాయీ సంఘా’నికి ప్రవేశంపై నిషేధం ♦ బలవంతంగా వెనక్కి పంపించిన వైనం ♦ జడ్పీ సీఈఓ నిర్ణయం.. సర్వత్రా ఆగ్రహం సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. బుధవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం కవరేజ్‌కి వెళ్లిన విలేకరులను జెడ్పీ సీఈఓ వర్షిణి తన సిబ్బంది ద్వారా బయటకు పంపించి వేశారు. ఇదేం పద్ధతంటూ ప్రశ్నించిన వారితో సీఈఓ వాగ్వాదానికి దిగారు. ‘ఇక్కడ మీకేం పని.. ఈ సమావేశానికి మీరు హాజరుకావాల్సిన పనిలేదు..ఇక వెళ్లండి’ అంటూ బలవంతంగా పంపించేశారు. ఈ మేరకు లేఖ ఇవ్వాలని ఇవ్వాలని పత్రికా ప్రతినిధులు పట్టుబట్టగా వెంటనే రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని అక్కడే ఉన్న సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. దీంతో విషయాన్ని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నేత ఫైసల్, జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దుబ్బాకలో ఉన్న మంత్రి హరీష్‌రావుకు జర్నలిస్టులు సీఈఓ వైఖరిని తప్పుబడుతూ వినతిపత్రం అందజేశారు. కాగా, జడ్పీ చైర్పర్సన్ రాజమణి సైతం సీఈఓ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్, కాంగ్రెస్ జెడ్పీటీసీ ప్రభాకర్, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ మీడియాపై ఆంక్షలు విధించటాన్ని ఖండించారు. సంప్రదాయాలు పాటించను.. జెడ్పీ సమావేశం, స్థాయీ సంఘ సమావేశాలకు మీడియా ప్రతినిధులు హాజరుకావటం ఆనవాయితీ. దీనికి విరుద్ధంగా విలేకరులు హాజరు కావొద్దంటూ సీఈఓ నిషేధం విధించడం కలకలం రేపింది. మీడియా ప్రతినిధులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. గత సంప్రదాయాలతో తనకు పని లేదన్నారు. అంతగా అవసరమైతే తమ సిబ్బంది సాయంత్రం వివరాలు చెబుతారు వార్తలు రాసుకోండన్నారు. ఉద్యమిస్తాం : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మీడియాపై ఆంక్షలు విధించటం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఈఓ తన వైఖరి మార్చుకుని ఆంక్షలు ఎత్తివేయపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తాం. - విష్ణువర్ధన్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు -
'తప్పు చేయకపోతే మీడియాపై ఆంక్షలెందుకు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయనే మీడియాపై కేసీఆర్ అంక్షలు విధిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తప్పులు చేయకపోతే మీడియా అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు. మీడియాను అణిచివేయాలని చూసిన ఎవ్వరూ మనుగడ సాధించలేదని ఆయన పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సమయంలోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈనెలాఖరున చేపట్టాల్సిన దీక్షను మార్చి 9న జరుపుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు. -
అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు!
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయనే భయంతోనే మీడియాపై కేసీఆర్ అంక్షలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తప్పులు చేయకపోతే మీడియా అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు. మీడియాను అణిచివేయాలని చూసిన ఎవ్వరూ మనుగడ సాధించలేదని మోత్కుపల్లి చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈనెలాఖరున చేపట్టాల్సిన దీక్షను మార్చి 9న చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు. -
అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు
హైదరాబాద్ : అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు విధించారు. లాబీ పాసులు ఉన్నా పోలీసులు లోనికి అనుమతించటం లేదు. దాంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.