అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు! | media is restricted in fear of government corruption, says motkupalli narsimhulu | Sakshi
Sakshi News home page

అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు!

Published Tue, Feb 24 2015 6:39 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు!

అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు!

టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయనే భయంతోనే మీడియాపై కేసీఆర్ అంక్షలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తప్పులు చేయకపోతే మీడియా అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు.

మీడియాను అణిచివేయాలని చూసిన ఎవ్వరూ మనుగడ సాధించలేదని మోత్కుపల్లి చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈనెలాఖరున చేపట్టాల్సిన దీక్షను మార్చి 9న చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement