
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్
షేర్లపై డిజిటల్ రుణం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా సెక్యూరిటీస్‌పై తక్షణ డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారా మూడు సరళమైన దశల్లో షేర్లపై రుణం పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్‌లో తాకట్టు పెట్టే షేర్లను ఎంపిక చేసుకొని, తర్వాత వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకొని, చివరగా ఓటీపీ ద్వారా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్)లో షేర్లను తాకట్టుపెట్టి రుణం పొందొచ్చు. షేర్లపై రుణానికి ప్రత్యేక కరెంట్ ఖాతా ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ అందించే పూర్తి ప్రక్రియను ఆటోమేటిక్ చేసిన మొదటి బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది. ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాకే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని త్వరలో ఫండ్స్, బాండ్లు, బీమా పాలసీలకు విస్తరిస్తామని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్యూచర్ జెనరాలి లైఫ్ నుంచి కొత్త ప్లాన్
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీ తాజాగా ఫ్యూచర్ జెనరాలి బిగ్ ఇన్‌కమ్ మల్టీప్లయర్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది కచ్చితమైన రాబడులను అం దించే నాన్‌లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ స్కీమ్. ఇందులో రూ.18,000 కనీస వార్షిక ప్రీమియంతో లేదా రూ.1,500 కనీస నెలవారీ ప్రీమియంతో ఇన్వెస్ట్‌మెంట్లను ప్రారంభించొచ్చు. ఇలా 12 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాలి. ప్లాన్‌లో సభ్యులుగా చేరాలంటే 4–50 ఏళ్ల వయసు ఉండాలి. వినియోగదారులు ఇన్సూరెన్స్ కవర్ పొందవచ్చు. కాగా బీమా సేవలు అందించడానికి సంస్థ యూకో బ్యాంక్‌తో కూడా జతకట్టింది.
ఎన్‌డీటీవీతో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జట్టు
దేశీ మూడో అతిపెద్ద నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్’ తాజాగా ఎన్‌డీటీవీ భాగస్వామ్యంతో ‘హెల్త్ మ్యాటర్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెల్త్ చెకప్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొం దించడం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను వారికి తెలియజేయడం, హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఉన్న సందేహాలను తొలగించడం లక్ష్యంగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు
ప్రభుత్వ/పీఎస్‌యూ ఉద్యోగుల కోసం ఫెడరల్ బ్యాంక్ ‘ఎక్స్‌క్లూ జివ్ పర్సనల్ లోన్’ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.
లాంగ్‌టర్మ్ టూవీలర్ బీమా పాలసీ
ప్రైవేట్ రంగంలోని సాధారణ బీమా సంస్థ రాయల్ సుందరమ్ దీర్ఘకాల టూవీలర్ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఒకే ప్రీమియమ్‌తో ఈ లాంగ్ టర్మ్ టూవీలర్ ప్యాకేజీ పాలసీని పొందవచ్చని తెలిపింది.
‘ఐసెలెక్ట్’ టర్మ్ ప్లాన్ ఆవిష్కరించిన కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియెంటల్
కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఆన్‌లైన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోని మారింత విస్తరించుకుంది. ఇది తాజాగా ఐసెలెక్ట్ టర్మ్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అందుబాటు ప్రీమియంలో కుటుంబానికి విస్తృతమైన ఇన్సూ రెన్స్ కవరేజ్‌ను అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది.