
ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్లోకి ఎన్‌డీటీవీ మీడియా గ్రూప్
స్పెషల్ అకేషన్ పేరుతో వెంచర్ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్ స్పేస్‌లోకి ఎన్‌డీటీవీ మీడియా గ్రూప్ ప్రవేశించింది. స్పెషల్ అకేషన్ పేరుతో ఆన్‌లైన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వెంచర్‌కు అమెరికాకు చెందిన సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి పెట్టుబడుల సమీకరించామని ఎన్‌డీటీవీ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో నిధులు సమీకరించిందీ కంపెనీ వెల్లడించలేదు. సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి సమీకరించిన పెట్టుబడులు ఆధారంగా స్పెషల్ అకేషన్ విలువను 2 కోట్ల డాలర్లుగా పేర్కొంది. ఈ స్పె షల్ అకేషన్ వెంచర్‌కు సీఈఓగా సచిన్ సింఘాల్‌ను నియమించామని వివరించింది.
తాము అందుబాటులోకి తెచ్చిన ఇండియన్‌రూట్స్‌డాట్‌కామ్, గాడ్జెట్360డాట్‌కామ్, కార్‌ఎన్‌బైక్‌డాట్‌కామ్.. వంటి ఈ కామర్స్ వెంచర్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎన్‌డీటీవీ సీఈఓ విక్రమ్ చంద్ర చెప్పారు. ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్ 4,000 కోట్ల డాలర్ల మార్కెట్ అనీ, అయితే అత్యధిక భాగం అవ్యవస్థీకృతంగా ఉందని సెర్రాక్యాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సౌరభ్ సూరి చెప్పారు.