నేటి నుంచి పీజీ తరగతులు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్‌లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్‌ల వారీగా నీట్ కటాఫ్ స్కోర్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment