pg seats
-
తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రెండు దశల్లో విడుదలైన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్రం పీజీ అడ్మిషన్లకు కటాఫ్ తగ్గించటంతో అందుకు తగ్గట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కలిపి రాష్ట్ర కోటా కింద 1,350 పీజీ సీట్లు ఉన్నాయి. కటాఫ్ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది. తగ్గిన కటాఫ్ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం (8వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇన్‌సర్వీస్ వైద్యులకు నిరాశే స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు. కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్ల వారీగా నీట్ కటాఫ్ స్కోర్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. -
మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కాంలో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైనట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. ఏమిటీ కుంభకోణం? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కనీ్వనర్ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీట్లను బ్లాక్ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. -
నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : మెడికల్ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టత ఇచ్చారాయననాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు నా కొడుక్కి ఇచ్చారు. గతంలో ఈడీ రైడ్స్ జరిగాయి. విచారణకు రమ్మంటారు.. అది రెగ్యులర్ ప్రాసెస్ అని అన్నారాయన. కాగా, మెడికల్ పీజీ సీట్ల స్కాం కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక నోటీసుల్లో.. అక్రమంగా సీట్లను బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో కిందటి ఏడాది మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు జరిపింది. అంతేకాదు మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కూడా. -
విజయవాడ ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు 15 పీజీ సీట్లు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు ఐదు విభాగాల్లో 15 పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) సీట్లు మంజూరయ్యాయి. దశాబ్దం కిందట మూడు విభాగాల్లో తొమ్మిది పీజీ సీట్లు రాగా, తాజాగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఐదు విభాగాల్లో 15 సీట్లు మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన సీట్లుకు 2023–24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దంత వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం ఇతర రాష్ట్రాలకువెళ్లకుండా ఇక్కడే అందుబాటులోకి వచ్చినట్లయింది. కొత్తగా మంజూరైన పీజీ సీట్లు మెరిట్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని దంత వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రెండు (విజయవాడ, కడప) ప్రభుత్వ దంతవైద్య కళాశాలలున్నాయి. దంత వైద్యంలో పీజీ చేసేందుకు ఇక్కడ సీట్లు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో రాష్ట్రంలోని ప్రైవేటు దంతవైద్య కళాశాలల్లో చేరాల్సి వచ్చేది. లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో ఇప్పటికే ఉన్న తొమ్మిది పీజీ సీట్లుకు అదనంగా మరో 15 సీట్లు మంజూరు కావడంతో ఏటా 24 మంది పీజీ చదివే అవకాశం లభించింది. అంతేగాకుండా రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి. సౌకర్యాల కల్పనతో.. ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు రోజూ 250 నుంచి 300 మంది వరకు రోగులు చికిత్సకు వస్తుంటారు. వారికి నాణ్యమైన దంతవైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. కొత్తగా డెంటల్ చైర్స్ ఏర్పాటు చేయడంతోపాటు, అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తనిఖీలు చేసిన డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ బృందం నివేదిక ఆధారంగా ఐదు విభాగాల్లో 15 పీజీ సీట్లు మంజూరు చేస్తూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతిస్తూ డీసీఐ ఉత్తర్వులు జారీచేసింది. -
Telangana: పీజీ మెడికల్ సీట్లు డబుల్.. కొత్తగా 232, సిద్ధిపేటకు అధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర ఏర్పాటు నాటికి వెయ్యి సీట్లే ఉండగా.. తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి మరో వెయ్యి సీట్లు సమకూరాయి. తాజాగా ప్రభుత్వ కాలేజీలకు మరో 232 పీజీ మెడికల్ సీట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచే వాటికి అడ్మిషన్లు నిర్వహించనున్నారు. తాజాగా అనుమతి వచ్చిన సీట్లలో కీలకమైన జనరల్ సర్జరీ విభాగంలో 28 సీట్లు, పీడియాట్రిక్స్‌లో 25, గైనకాలజీ విభాగంలో 19 సీట్లు, ఆర్థోపెడిక్స్‌లో 12 సీట్లు ఉన్నాయి. ఇవిగాక ఎండీ అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, సైకియాట్రీ, ఆప్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, పల్మనరీ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి విభాగాల్లో సీట్లు పెరిగాయి. సిద్దిపేట కాలేజీకి ఏకంగా 80 సీట్లు రాష్ట్రంలో మొత్తంగా ప్రైవేట్‌లో 23, ప్రభుత్వంలో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 232 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా సిద్ధిపేట మెడికల్ కాలేజీకి 80 పీజీ మెడికల్ సీట్లు మంజూరయ్యాయి. సూర్యాపేట మెడికల్ కాలేజీకి 25, నల్లగొండ మెడికల్ కాలేజీకి 30, నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 16, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 32, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 10, కాకతీయ మెడికల్ కాలేజీకి 3, ఆదిలాబాద్ రిమ్స్‌కు 22, గాంధీ మెడికల్ కాలేజీకి 14 సీట్లను కొత్తగా మంజూరు చేశారు. పీజీ సీట్ల సంఖ్య పెరగడం వల్ల ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. నాన్ క్లీనికల్‌లో పెరగడంతో.. క్లినికల్ విభాగాల కంటే నాన్ క్లినికల్ విభాగాల్లో సీట్లు ఎక్కువగా పెరగడంపై నిరాశ వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేసి.. స్పెషలిస్టు వైద్యులుగా కెరీర్‌ను మలుచుకోవాలని భావిస్తుంటారు. అందువల్ల క్లినికల్ విభాగాలకు సంబంధించి ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు కూడా కోట్లు చెల్లించి చేరుతుంటారు. నాన్ క్లినికల్ పీజీ సీట్లకు మాత్రం డిమాండ్ తక్కువ. కొన్ని విభాగాల్లో అయితే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరని పరిస్థితి ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. అలాంటిది మళ్లీ నాన్ క్లినికల్ సీట్లు పెంచారని పేర్కొంటున్నారు. -
రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: మమత వైద్య కళాశాలలో పీజీ మెడికల్ సీట్ల దందా జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలో 20 ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. తన కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్లు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే.. కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేని పక్షంలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతాయని, అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. చదవండి👉🏾 జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు నా ఆరోపణల్లో తప్పుంటే తప్పుకుంటా: రేవంత్ సాక్షి, హైదరాబాద్: మంత్రులకు చెందిన మెడికల్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల విషయంలో తాను చేసే ఆరోపణల్లో వీసమెత్తు తప్పున్నా ఏ శిక్షకైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తన ఆరోపణలపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రేవంత్ సవాల్ విసిరారు. ‘మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్‌తో ఒకే రోజు విచారణ జరిపించాలి. అవకతవకలు జరగలేదని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ ఒక్క పరీక్షకు నిజాయితీగా నిలబడండి. అన్నీ దొంగ పనులు చేసి వేషాలు వేస్తున్నారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో ప్రగతిభవన్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని రాజీవ్ చౌరస్తా వద్దే అదుపులోకి తీసుకుని గోషామహల్‌కు తరలించారు. చదవండి👉 నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్ -
వైద్య విద్యార్థులకు మరో శుభవార్త..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వైద్య విద్యార్థులకు మరో శుభవార్త. ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను సడలించింది. ఇకపై మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు (అండర్ గ్రాడ్యుయేట్) ఎన్ని ఉంటాయో పీజీ వైద్య సీట్లను కూడా ఆ మేరకు పెంచుకోవచ్చని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యవిద్యా శాఖ పీజీ వైద్య సీట్ల పెంపుపై దృష్టి సారించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లుండగా 910 మాత్రమే పీజీ వైద్య సీట్లున్నాయి. ఇప్పుడు అదనంగా 1,275 సీట్లను పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 308 పీజీ సీట్లకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ జారీచేసింది. అంటే వచ్చే ఏడాది ఈ 308 సీట్లు దాదాపుగా ఖరారైనట్టే. ఇవికాకుండా 967 సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ వైద్య సీటును రూ. కోట్లలో విక్రయిస్తున్న తరుణంలో ప్రభుత్వ కాలేజీల పరిధిలో సీట్లు పెరగనుండటం మెరిట్ విద్యార్థులకు వరం లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యులు, మౌలిక సదుపాయాలు.. కొత్తగా సీట్లు పెరగాలంటే తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు విధిగా అవసరం. దీంతో పాటు మౌలిక వసతులను కూడా మెరుగు పరచాల్సి ఉంటుంది. నర్సులు, పారా మెడికల్ సిబ్బందినీ నియమించుకోవాలి. వీటన్నిటిపైనా వైద్యవిద్యాశాఖ ప్రత్యేక నివేదిక తయారు చేస్తోంది. పెంచుకునే అవకాశం ఉన్న ప్రతి సీటునూ ఎలాగైనా సాధించేలా కసరత్తు చేస్తున్నారు. మంచి అవకాశం.. జాతీయ మెడికల్ కమిషన్ పీజీ సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 308 పీజీ సీట్లకు అనుమతిచ్చింది. మిగతా సీట్లకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల భారీగా ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి’ – డా.రాఘవేంద్రరావు, వైద్యవిద్యా సంచాలకులు చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ఇటీవలే 700 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, తాజాగా అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర చర్యలతో ఎండీ, ఎంఎస్ వంటి పీజీ సీట్లకు అర్హత వచ్చింది. దీంతో పలు కాలేజీల్లో వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కళాశాలల్లో దరఖాస్తు చేసిన సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో సుమారు ఐదు విభాగాల్లో 28 సీట్లు రానున్నాయి. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో గైనకాలజీ సీట్లు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సీట్లకు దరఖాస్తు చేశారు. కాకినాడలోని వైద్య కళాశాలకు భారీగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. సీట్లు పెరగడం వల్ల పేదలకు భారీ లబ్ధి జరగనుంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం కాలేజీల్లో కూడా భారీగా పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు దరఖాస్తు చేశారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ కలిపి ఒకేసారి 145 సీట్లు పెరగడం ఇదే మొదటిసారి. ఈ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. సీట్లతో పాటు మౌలిక వసతుల కల్పన వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలి. ఒక్కో యూనిట్‌కు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఒక ప్రొఫెసర్ ఉండాలి. స్టాఫ్ నర్సులు, ఆపరేషన్ థియేటర్లు పెరుగుతాయి. ఇంటెన్సివ్ కేర్, ఆక్సిజన్ బెడ్స్ విధిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, వైద్యులు పెరిగితే ఆటోమేటిగ్గా ఎక్కువ మంది పేషెంట్లకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల త్వరలో పెరగనున్న పీజీ సీట్లతో భారీగా వసతులు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతం జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నాం. అదనపు సీట్లతో భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. సీట్లకు సరిపడా ప్రొఫెసర్ల కోసం అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు భారీగా బలోపేతం కానున్నాయి. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
పీజీ మెడికల్ సీట్ల అప్పగింతకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో రెండేళ్ల పీజీ డిప్లొమో సీట్లను అప్పగించి మూడేళ్ల పీజీ సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2020–21 విద్యా సంవత్సరంలో ఆ విధంగా అమలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఏ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ పి.భావన సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆరు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లోని 18 పీజీ డిప్లొమో సీట్లను ప్రభుత్వానికి అప్పగించి మెడికల్ సీట్లు పొందాయని, వీటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కామినేని, కాకతీయ, ఎంఎన్ఆర్, ప్రతిమ, గాంధీ మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే 50 శాతం వారికి ఉన్న రిజర్వేషన్ల అవకాశాలు దెబ్బతింటాయని, పిటిషనర్ కూడా నష్టపోయారని ఆమె న్యాయవాది వాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే వారు రెండేళ్ల పీజీ డిప్లమోతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని ఎంసీఏ, ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వేళ వైద్య విద్యను వృద్ధి చేయాలని, నైపుణ్యతను పెంచాలని ప్రభుత్వం భావించి ఉంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేది కాదని, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మేలు జరిగేలా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. -
కొత్త మెడికల్ సీట్లకు కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు మూడేళ్లలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఒక్కో పీజీ, ఎంబీబీఎస్ సీటుకు రూ. 1.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ)ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని వైద్య విద్యా విభాగం ఆదేశించింది. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం ఆయా కాలేజీల్లో మొత్తంగా 600 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. దాంతోపాటు ఈ ఏడాది కేంద్రం అగ్రవర్ణాల్లోని ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు వివిధ కాలేజీల్లో మరో 190 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. ఇవన్నీ కలిపి 790 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి కొత్తగా వచ్చాయి. వాటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కలిపి 150 వరకు పీజీ మెడికల్ సీట్లు వచ్చాయి. అంటే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు అన్నీ కలిపి 940 మెడికల్ సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మంజూరు చేసింది. వీటన్నింటికీ కలిపి రూ. 1,128 కోట్ల ఆర్థిక సాయం కేంద్రం నుంచి రానుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం మెడికల్ సీట్లు పెంచినప్పుడు ఆ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. సీట్లతోపాటు ఆ మేరకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్ వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ విస్తరణ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. అందుకోసం కేంద్రం సీట్లు మంజూరు చేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా వచ్చిన పీజీ, ఎంబీబీఎస్ సీట్లకు కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వైద్య విభాగం జాయింట్ సెక్రటరీ దీనిపై అధికారులను నిలదీశారు. నిధుల కోసం ప్రతిపాదనలు ఎందుకు పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థికసాయానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాక, అక్కడినుంచి కేంద్రానికి వెళుతుంది. మరోవైపు ఎంబీబీఎస్ సీట్లకు కేంద్ర సాయం విషయంలో స్పష్టత తీసుకుంటున్నాం. నిబంధనలను పరిశీలిస్తున్నాం. కేంద్ర అధికారి ఎంబీబీఎస్ సీట్లకు ఆర్థికసాయం ఉందని చెప్పారు. ఈసారి ఢిల్లీ వెళ్లాక దీనిపై స్పష్టత తీసుకున్నాక ప్రతిపాదనలు తయారు చేస్తాం. – డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీఎంఈ -
మెడిసిన్ పీజీ సీటు పేరుతో నగర వైద్యురాలికి టోకరా
సాక్షి, సిటీబ్యూరో: బల్క్ ఎస్సెమ్మెస్ వచ్చింది... మెడిసిన్ పీజీ సీట్లంది... అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదిస్తే ముఠా మాట్లాడింది... వందలు, వేలకు డీడీలు కట్టించింది... స్ఫూఫింగ్ చేసిన మెయిల్స్ ద్వారా సీట్లు ఇచ్చేసింది... నేరుగా వచ్చి రూ.లక్షల్లో ఎత్తుకుపోయింది. సెంట్రల్ పూల్, ఎన్ఆర్ఐ కోటాల్లో భారత్, నేపాల్ల్లోని పేరున్న వైద్య కళాశాలల్లో మెడిసిన్‌లో పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వైద్యురాలిని రూ.81 లక్షలు మోసం చేసిన ఈ ఢిల్లీకి చెందిన నకిలీ డాక్టర్ల ముఠా గుట్టును నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జూన్‌లో రట్టు చేశారు. అప్పట్లో ప్రధాన సూత్రధారితో పాటు మరో అనుచరుడినీ పట్టుకున్నారు. వీరి సూచనల మేరకు నగరానికి వచ్చిన డబ్బు తీసుకువెళ్ళిన వ్యక్తి çసునీల్‌కుమార్‌గా గుర్తించిన అధికారులు అతడి కోసం ఢిల్లీలో ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు పట్టుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఆర్ఎస్ యాదవ్ పేరుతో ఎస్సెమ్మెస్... నగరానికి చెందిన డాక్టర్ ఫాతిమా రజ్వీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తన కుమార్తెకు పీజీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఉండగానే ఆమెకు కొన్ని నెలల క్రితం (HP& MKTING, AD& MKTING)ల నుంచి బల్క్ ఎస్సెమ్మెస్ వచ్చింది. అందులో పీజీ సీట్ల కోసం సంప్రదించాలంటూ ఆర్ఎస్ యాదవ్ పేరు, ఫోన్ నెంబర్ ఉండటంతో ఆమె అలానే చేశారు. ఆమె కుమార్తెకు బెంగళూరులోని బెంగళూరు మెడికల్ కాలేజీ, మైసూరులోని మైసూరు మెడికల్ కాలేజ్, బళ్ళారిలోని విజయ్‌నగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ల్లో ఎక్కడైనా సీటు ఇప్పిస్తామంటూ మాట్లాడాడు. తొలుత న్యూ ఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతో రూ.5 వేలు డీడీ తీయమని చెప్పాడు. ఆ సంస్థ నుంచే ఈ–మెయిల్ వచ్చినట్లు స్ఫూఫింగ్ పరిజ్ఞానం ద్వారా (addir@mohfw.nic.in) నుంచి ఓ దరఖాస్తు సైతం పంపాడు. సింగ్‌గా చెప్పుకున్న వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చి దరఖాస్తుతో పాటు డీడీ తీసుకుని వెళ్ళాడు. వెళ్తూ విషయం గోప్యంగా ఉంచాల్సిందిగా ఆమెకు చెప్పాడు. కొనసాగిన స్పూఫింగ్ వ్యవహారం.. ఇది జరిగిన కొన్ని రోజులకు కేంద్ర ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి సెంట్రల్ పూల్ కోటాలో సీటు ఖరారైనట్లు మరో స్ఫూఫ్డ్ మెయిల్ (noreply@mohfw.nic.in) నుంచి ఫాతిమాకు సందేశం ఇచ్చారు. ఇది చూసిన ఆమె కేంద్ర శాఖ నుంచే మెయిల్ వచ్చినట్లు భావించారు. ఆపై డాక్టర్ ఆర్ఎస్ యాదవ్‌గా చెప్పుకున్న ఢిల్లీకి చెందిన సునీల్‌కుమార్ శంషాబాద్ విమానాశ్రయానికి రెండుసార్లు వచ్చి రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నాడు. ఆపై(noreply@mohfw.nic.in) నుంచే మరో ఈ–మెయిల్ పంపిన మోసగాళ్ళు బళ్ళారిలోని విజయ్‌నగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు ఖరారైనట్లు పేర్కొన్నారు. మళ్ళీ సిటీకి వచ్చిన సునీల్ మరో రూ.36 లక్షలు తీసుకున్నాడు.( www.rguhs.ac.in) వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు పూరించడంతో పాటు రూ.3 వేలు చెల్లించాలని సూచించారు. హఠాత్తుగా సెల్ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్... ఈ ప్రక్రియ పూర్తి చేయించిన తర్వాత డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయడానికి సీటు ఖరారైందంటూ మరో ఈ–మెయిల్ పంపారు. విజయ్‌నగర్ ఇన్స్టిట్యూట్ను నిర్వహించే రాజీవ్ గాంధీ యూనివర్విటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో మరో రూ.16,700 ట్యూషన్ ఫీజు డీడీ రూపంలో చెల్లించమన్నారు. ఈసారి ఫాతిమానే ముంబై రప్పించుకున్న ముఠా అక్కడి విమానాశ్రయంలో కలిసి డీడీతో పాటు రూ.15 లక్షల నగదు తీసుకున్నారు. ఇలా మొత్తం రూ.81 లక్షలు వసూలు చేసిన తర్వాత తమ సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి చెందిన ఘరానా మోసగాడు సంతోష్ రాయ్, ఇతడి అనుచరుడు మనోజ్ కుమార్‌ను జూన్‌లో అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్‌కు చెందిన ఢిల్లీ వ్యక్తి సునీల్ కుమార్ డాక్టర్ ఆర్కే యాదవ్‌గా, మనోజ్ కుమార్ సింగ్‌గా నటించినట్లు బయటపడింది. దీంతో అతడి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు పట్టుకోగలిగింది. పరారీలో ఉన్న మరో నిందితుడు అమిత్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. సంతోష్‌రాయ్, మనోజ్‌లపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదై ఉన్నాయి. -
బెంగళూరులోనే రూ.100 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సూడో డాక్టర్ సంతోష్ కుమార్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు న్నాయి. ఎలాంటి ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా వివిధ రకాలైన కోటాల్లో మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇతడిని బెంగళూరు అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. కేవలం బెంగళూరులోనే ఇతడి స్కామ్ రూ.100 కోట్లు ఉంటుందని వెలు గులోకి వచ్చింది. రూ.30 కోట్లకు సంబంధించి 22 మంది ఫిర్యాదు చేయగా మిగిలినవారు మిన్నకుండిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన మిగిలిన సభ్యుల్ని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఢిల్లీకి వెళ్లడానికి సన్నా హాలు చేస్తోంది. సంతోష్ దాదాపు పదిహేనేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి ఈ ముఠా కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని సైతం నిర్వహించగా పోలీసులు దీన్ని సీజ్ చేశారు. పటిష్టమైన నెట్వర్క్ ద్వారా... పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడని అధికారులు చెప్తున్నారు. వెబ్సైట్లు హ్యాక్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, స్ఫూఫింగ్‌కు పాల్పడటం కోసం బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకున్నారు. బాధితుల నుంచి నగదు సేకరిం చే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపేవాడు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే అనుచరులు వారణాసి కేంద్రంగా పనిచేస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో సేకరించిన నగదునైనా ఈ గ్యాంగ్ ముంబైకే తరలిస్తుంది. అక్కడ నుంచి హవా లా రూపంలో ఇతర చోట్లకు పంపిస్తుంటుంది. బెంగళూరు పోలీసులు బాధితులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరగా వారు అంగీకరించలేదు. తాము రూ.కోటి వరకు నగదు రూపంలో చెల్లించినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త తలనొప్పులు వస్తాయని చెప్పినట్లు తెలిసింది. రిక‘వర్రీ’గా మారిన డబ్బు సంతోష్ అనేకమంది నుంచి కాజేసిన డబ్బు ఏమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతడు ఓ మతపరమైన సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తాను ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చానని, తమకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని పోలీసులకు సంతోష్ చెప్పాడు. ఇందులో నిజానిజాలను సైతం నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినా కనీసం రూ.కోటి కూడా వాటిలో లేదని పోలీసులు చెప్తున్నారు. సంతోష్ ఈ పంథాలో రెచ్చిపోవడానికి ఢిల్లీకి చెందిన కొందరు బడాబాబుల సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేశారు. వీరిలో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలిసింది. -
సూడో డాక్టర్ సూపర్ నెట్వర్క్!
సాక్షి, హైదరాబాద్: ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామం టూ బల్క్ ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఘరానా గ్యాంగ్‌కు సంతోష్ కుమార్ రాయ్ సూత్రధారి అని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గురువారం పోలీసులు అరెస్టు చేసిన ఇరువురిలో ఇతడూ ఉన్నాడు. పదిహేనేళ్లుగా సంతోష్ ఇదే దందాలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అతడు పలువురిని బ్లాక్మెయిల్ కూడా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారించేందుకుగాను వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి లభిస్తే సంతోష్‌ను ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్లి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసిం ది. బ్యాంక్ ఖాతాల్లో వేయించుకుంటే పోలీ సులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో కేవలం నగదు మాత్రమే తీసుకుంటుంది. దీనికోసం సంతోష్ తన అనుచరుల్ని ఏ ప్రాంతా నికి కావాలంటే ఆ ప్రాంతానికి పంపిస్తుంటాడు. కొన్నిసార్లు టార్గెట్‌నే ముంబైకి పిలి పించుకుని వసూలు చేశాడు. మెడిసిన్ పీజీ సీట్లు ఆశించేవారికి నమ్మకం కలగడానికి సం తోష్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తోపాటు వివిధ యూనివర్సిటీల పేర్లతో కొన్ని డీడీలను సైతం కట్టిస్తాడు. సిటీ కి చెం దిన బాధితురాలు డాక్టర్ ఫాతిమా రజ్వీతో నూ రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.16,700 డీడీలు కట్టించాడు. నగదుతోపాటు వీటిని కలెక్ట్ చేసుకునే ఈ గ్యాంగ్ ఎక్కడా ఎన్‌క్యాష్ చేయదు. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని సీజ్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘ఏరియా’కు ఓ పని అప్పగింత పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వెబ్సైట్లు హ్యాకింగ్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, స్పూఫింగ్‌కు పాల్పడటం తదితర ‘సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ’ బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఏర్పాటు చేసుకున్నాడు. నగదు కలెక్ట్ చేసుకునే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపిస్తాడు. బల్క్ ఎస్సెమ్మె స్లు పంపే వారు వారణాసి కేం ద్రంగా పనిచేస్తారు. సంతోష్ తన అనుచరుల్లో కొందరికి జీతాలు, మరికొందరికి కమీషన్లు ఇస్తుంటాడు. వివాదాస్పద నిర్మాతగా... హిందుత్వవాదిగా పేరున్న సం తోష్ రాయ్ అఖిల భారతీయ హిం దూ మహాసభ సీనియర్ లీడర్ హోదాలో అనేక జాతీయ చానళ్లలో చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రహ్మర్షి ఫిలింస్ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేసి కొన్ని బాలీవుడ్ చిత్రాలనూ నిర్మించాడు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే చరిత్రను 2011లో ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కించాడు. ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ తదితరుల అరెస్టుతో తెరపైకి వచ్చిన హిం దూ ఉగ్రవాదంపై బాలీ వుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని గతేడాది భావిం చారు. అలాం టి ప్రయత్నాలు చేస్తే బాలీవుడ్లో చిత్ర నిర్మాణం ఆగిపోతుందంటూ హెచ్చరించి వివాదాస్పదుడయ్యాడు. అతడు బ్రహ్మర్షి ఫిలింస్‌తోపాటు పలు సంస్థలు నెలకొల్పాడు. ఇతడి ‘మెడిసిన్’మోసాలపై ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ల్లోనూ కేసులు నమోదయ్యాయి. అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లతోపాటు మరికొందరు ప్రముఖుల్నీ బ్లాక్మెయిల్ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో సీట్ల వివాదం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీజీ సీట్ల భర్తీపై వివాదం చెలరేగింది. పీజీలో మిగిలిన సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్‌ల తర్వాత మిగిలిపోయిన సీట్లను రిజర్వేషన్ పద్ధతిలో భర్తీ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల డిమాండ్లను మాత్రం వర్సిటీ అధికారులు తిరస్కరించారు. జీవో నెంబర్ 68 ప్రకారం వర్సిటీకి సరెండర్ చేసిన సీట్లను ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తామంటూ అధికారులు తెలిపారు. -
పీజీ మెడికల్‌కు నేషనల్ పూల్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో నేషనల్ పూల్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం పీజీ వైద్య సీట్ల భర్తీ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం భారత వైద్య మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో 50 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి, మిగిలిన 50 శాతం సీట్లను స్థానిక కోటాగా పరిగణించనున్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేస్తారు. ప్రస్తుతం వైద్య ఉద్యోగంలో ఉన్న వారికి (ఇన్ సర్వీస్ అభ్యర్థులు).. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి సర్వీస్ రిజర్వేషన్లకు బదులుగా నీట్లో వచ్చిన మార్కులకు అదనంగా వెయిటేజీ మార్కులు కలపనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 30 శాతం.. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 24 శాతం మార్కులు కలుపుతారు. అలాగే సర్వీస్ అభ్యర్థులకు డిప్లొమా చేసిన సబ్జెక్టులోనే పీజీ చేయాలనే నిబంధన తొలగించారు. త్వరలో నోటిఫికేషన్ భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ జరుగుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
నేషనల్ పూల్‌లోకి పీజీ మెడికల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈసారి పీజీ వైద్య సీట్లకు నేషనల్ పూల్ పద్ధతిని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య పీజీ సీట్లలో 15 శాతం కోటాకు పోటీ పడనున్నారు. అలాగే రాష్ట్రంలోని 15 శాతం సీట్లను దేశవ్యాప్తంగా ఉండే అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికన దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు వైద్య విద్య పీజీ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో ర్యాంకులు.. నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నీట్ పీజీృ2018 ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ర్యాంకుల జాబితాలను రెండు మూడు రోజుల్లో సిద్ధం చేయనుంది. అల్లోపతి, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ అన్ని కోర్సులు కలిపి రాష్ట్రంలో మొత్తం 2,262 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 805, ప్రైవేటు కాలేజీల్లో 1,451 సీట్లున్నాయి. అల్లోపతి వైద్య విద్య పీజీ సీట్లు రాష్ట్రంలో 1,405 ఉన్నాయి. వీటిలో 683 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఈసారి 6 పీజీ వైద్య విద్య సీట్లు పెరిగాయి. గాంధీ వైద్య కాలేజీకి కొత్తగా 3 హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సీట్లను ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో కొత్తగా 3 పీజీ సీట్లను ఫార్మ కాలజీ (ఔషధ) విభాగంలో కేటాయించింది. 2018ృ 19 విద్యా సంవత్సరంలో ఈ కొత్త సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా ర్యాంకుల జాబితా అందగానే సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
‘పీజీ సీట్ల కోసం ఉద్యమం’
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పీజీ సీట్ల కోసం ప్రజా ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ స్పష్టం చేశారు. పీజీ సీట్లు మంజూరు చేయాలంటూ మంగళవారం సర్వజనాస్పత్రి ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఇక్కడి కళాశాల పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా ఇ¯ŒSచార్‌్జగా ఉన్నా ఏనాడూ కళాశాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కళాశాలలోని అన్ని విభాగాల్లో పీజీ సీట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 8వ రోజుకు చేరిన దీక్షలు మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు, వైద్యుల సమస్యల పరిష్కారం కోసం సర్వజనాస్పత్రిలో వైద్యులు చేస్తున్న రిలే దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్లు పూజారి శ్రీనివాస్, కిశోర్, రాజశేఖర్‌లు దీక్షలో కూర్చున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ వీరభద్రయ్య తెలిపారు. -
శవాలతో సావాసం మాకొద్దు..!
ఫోరెన్సిక్ మెడిసిన్‌పై అభ్యర్థుల్లో తగ్గుతున్న ఆసక్తి సగం పీజీ సీట్లు కూడా భర్తీకాని వైనం ప్రభుత్వాస్పత్రుల్లో శవ పరీక్షకు వైద్యుల కరువు పంచనామా చేసిన వైద్యులే మళ్లీ పాఠాలూ చెప్పాలి ప్రైవేటులో అవకాశాలు లేకనే రావడం లేదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫోరెన్సిక్ మెడిసిన్‌కు సినిమాల్లో తప్ప వాస్తవంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండడంలేదు. పీజీ చెయ్యక పోయినా ఫర్వాలేదుగానీ, నాన్క్లినికల్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కోర్సులో సీటు తీసుకోకూడదనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీసం సగం పీజీ వైద్య సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఫోరెన్సిక్ మెడిసన్ సీట్లు 12 ఉండగా ఈ ఏడాది కేవలం 3 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పీజీ చేసినా మార్చురీలో పనిచేయడం మినహా ఎక్కడా ప్రాధాన్యత లేదని ప్రస్తుతం ఫోరెన్సిక్ పూర్తిచేసిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ పోస్టులకు నియామకాలు లేవు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలూ లేకపోవడం దీనిపై ఆసక్తి లేకపోవడానికి మరో కారణం. ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసులు, మెడికో లీగల్ కేసులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే శవ పంచనామా జరగాలి. కానీ అక్కడ ఫోరెన్సిక్ వైద్యుల కొరత వేధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొత్తం 11 బోధనాస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు ఉంటే అందులో శవ పరీక్షలు నిర్వహించే దిక్కులేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రమాద కేసులో మృతిచెందితే నిరీక్షణే ఏటికేటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మృతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఆయా జిల్లా ఆస్పత్రి లేదా బోధనాస్పత్రికి తీసుకెళతారు. కానీ బోధనాస్పత్రుల్లో 8 మంది ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులుండాల్సి ఉంటే కనీసం ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఒక్కో బోధనాస్పత్రికి సగటున రోజుకు ప్రమాద లేదా ఆత్మహత్య మృతుల కేసులు 10 నుంచి 15 వరకూ వస్తుంటాయి. అంటే రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 నుంచి 200 వరకూ మృతులకు పంచనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు లేక చివరకు అటెండర్లు, వార్డు బాయ్లే శవ పంచనామా చేసి తూతూమంత్రంగా రిపోర్టు రాసే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు కడప రిమ్స్‌లో ఆరుగురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శవాలు ఎక్కువగా వస్తే పంచనామా జాప్యమవుతోంది. పోనీ శవాలకు సరిపడా ఫ్రీజర్లు(శీతల పెట్టెలు) ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు ఎంతోకొంత లంచమిచ్చి త్వరగా పంచనామా చేయించుకుంటున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి పెద్దాస్పత్రుల్లో విపరీతంగా ప్రమాద మృతుల కేసులు పంచనామాకు వస్తుంటాయి. అలాంటి చోటే వైద్యులు లేరు. ఉన్న వైద్యులు పంచనామా చేయడంతోపాటు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి. ప్రైవేటులో అవకాశాలు లేకనే.. ప్రభుత్వాస్పత్రుల్లోనే శవపంచనామా చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అభ్యర్థులకు అవకాశాలు లేవు. దీంతో కొంతమంది అనాసక్తి చూపిస్తున్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల కొరత లేదు. త్వరలోనే పదోన్నతులు చేపడుతున్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్లో ఎండీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటాం. – డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్) -
పీజీ వైద్య సీట్ల భర్తీ ఎప్పుడు?
ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ వైద్య సీట్లు మిగిలిన వైనం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 118 పీజీ సీట్లు మిగిలిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలు కౌన్సెలింగ్ నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి తొలిసారిగా 2016-17లో వెబ్ కౌన్సెలింగ్ పెట్టారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఏపీలో 86 పీజీ సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మిగిలిపోయాయి. అయినప్పటికీ మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించే దిశగా వర్సిటీలు చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు విద్యార్థులు జూలై 13న హైకోర్టును ఆశ్రయించారు. రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ జరపాలని హైకోర్టు ధర్మాసనం అదేనెల 23న తీర్పునిచ్చింది. అయితే ఎంసీఐ హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఈనెల 8న తీర్పునిచ్చింది. చివరి విడత కౌన్సెలింగ్‌ను రెండువారాల్లోగా నిర్వహించి సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌కు పూనుకోకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు ముగిశాక ఆర్డర్ కాపీ వచ్చింది సుప్రీంకోర్టు 2 వారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పింది. కానీ ఆ ఉత్తర్వుల కాపీ గడువు ముగిశాక వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును వివరణ కోరాం. కోర్టు ఆదేశాలు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. - డాక్టర్ టి.రవిరాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు
పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు మరో 86 పీజీ సీట్లకు ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడంతో.. మంజూరైనా ఇప్పటివరకు గుర్తింపు లేకుండా ఉన్న 49 సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీ సీట్లకు గుర్తింపునిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. అందులో సూపర్ స్పెషాలిటీ సీట్లు 8 ఉండగా... బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లు 41 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సీట్లు 6, గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ సీట్లు 2 ఉన్నాయి. ఇక బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్లు 11, ఎండీ అనస్థీషియా సీట్లు 9, ఎండీ బయో కెమిస్ట్రీ 4, ఎండీ డీవీఎల్ 4, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 3, ఎండీ ఫోరెన్సిక్ మెడిసిన్ 3, ఎండీ రేడియోథెరపీ 2, ఎండీ మైక్రో బయాలజీ 2, ఎండీ ఫార్మకాలజీ 2 సీట్లు గుర్తింపు పొందాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఎండీ డీవీఎల్కు చెందిన ఒక్క సీటుకు కూడా ఎంసీఐ గుర్తింపునిచ్చింది. వాస్తవంగా ఈ సీట్లకు వచ్చే ఏడాది మే నెల నాటికి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. అయితే గడువుకు ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలావుండగా రాష్ట్రానికి అదనంగా మరో 86 పీజీ మెడికల్ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 47, గాంధీ మెడికల్ కాలేజీకి 13, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి 26 సీట్లు కావాలని ప్రతిపాదించింది. ఇవి గనుక మంజూరైతే ఈ మూడు కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న 516 సీట్లకు కలిపితే మొత్తం 602 పీజీ సీట్లు కానున్నాయి.