8వ రోజుకు చేరిన దీక్షలు
‘పీజీ సీట్ల కోసం ఉద్యమం’
Published Wed, Apr 12 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పీజీ సీట్ల కోసం ప్రజా ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ స్పష్టం చేశారు. పీజీ సీట్లు మంజూరు చేయాలంటూ మంగళవారం సర్వజనాస్పత్రి ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఇక్కడి కళాశాల పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా ఇ¯ŒSచార్‌్జగా ఉన్నా ఏనాడూ కళాశాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కళాశాలలోని అన్ని విభాగాల్లో పీజీ సీట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
8వ రోజుకు చేరిన దీక్షలు
8వ రోజుకు చేరిన దీక్షలు
మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు, వైద్యుల సమస్యల పరిష్కారం కోసం సర్వజనాస్పత్రిలో వైద్యులు చేస్తున్న రిలే దీక్షలు మంగళవారం 8వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్లు పూజారి శ్రీనివాస్, కిశోర్, రాజశేఖర్‌లు దీక్షలో కూర్చున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ వీరభద్రయ్య తెలిపారు.
Advertisement
Advertisement