సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీజీ సీట్ల భర్తీపై వివాదం చెలరేగింది. పీజీలో మిగిలిన సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్‌ల తర్వాత మిగిలిపోయిన సీట్లను రిజర్వేషన్ పద్ధతిలో భర్తీ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల డిమాండ్లను మాత్రం వర్సిటీ అధికారులు తిరస్కరించారు. జీవో నెంబర్ 68 ప్రకారం వర్సిటీకి సరెండర్ చేసిన సీట్లను ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తామంటూ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment