నేను ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించను: నటి | Radhika Madan On Her Love Life: I Never Love In Instalments | Sakshi
Sakshi News home page

Radhika Madan: 'లవ్‌ విషయంలో నేను అలాగే ఉంటా'

Published Sun, Sep 19 2021 6:31 PM | Last Updated on Sun, Sep 19 2021 8:37 PM

Radhika Madan On Her Love Life: I Never Love In Instalments - Sakshi

Radhika Madan Opens Up About Love: 'నాకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించడం నచ్చదు. అందుకే లవ్‌ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. అయితే జీరో పర్సెంట్‌ లేదంటే 100%' అంటూ లవ్‌ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్‌. ఇటీవలె ఆమె నటించిన 'శిద్ధత్‌' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాధిక ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇక 'మేరీ ఆషీకి తుమ్‌ సే హై' అనే టెలివిజన్‌ షోతో కెరీర్‌ ప్రారంభం చేసిన రాధిక 'పటాకా' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో రాధిక నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందింది. తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరిస్తానని, 200శాతం బెస్ట్‌గా ఇ‍చ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. కాగా ఈమె నటించి శిద్ధత్‌ సినిమా అక్టోబర్‌ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement