installments
-
క్విక్ కామర్స్ ఈఎంఐ రూట్!
చెంగు చెంగున మార్కెట్లో దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ కంపెనీలు... కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ సంస్థల రూట్లోనే కొంగొత్త పేమెంట్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా మార్కెట్‌ను మరింత ‘క్విక్’గా కొల్లగొట్టాలనేది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో బ్లింకిట్ తదితర దిగ్గజాల ప్లాన్!! పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్మురేపుతున్న క్విక్ కామ్ సంస్థలు.. ఈ–కామర్స్ దిగ్గజాలకు పక్కలో బల్లెంలా మారుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ల విషయంలోనూ ‘నీవు నేర్పిన విద్యే..’ అన్న చందంగా తయారైంది వాటి వ్యూహం. రూ. 2,999 పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తొలిసారి 2016లోనే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టగా... అమెజాన్ కూడా 2018లో దీన్ని అనుసరించింది. పలు డెబిట్ కార్డులతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమలు చేస్తున్నాయి. ‘ఈఎంఐ అవకాశం కలి్పంచడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి! మరోపక్క, దాదాపు దిగ్గజ క్విక్ కామర్స్ కంపెనీలన్నీ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు తర్వాత చెల్లించే (బై నౌ, పే లేటర్) పేమెంట్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం సింపుల్, పేయూకి చెందిన లేజీ పే వంటి కంపెనీలతో జట్టుకట్టాయి. ఫ్లిప్‌కార్ట్ 2017లో ఈ పే లేటర్ ఫీచర్ ద్వారా యూజర్లకు రూ. లక్ష వరకు ఇన్స్టంట్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నయా పైసా చెల్లించకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసి, తర్వాత నెలలో పూర్తిగా చెల్లించడం, లేదంటే ఈఎంఐగా మార్చుకునే అవకాశాన్ని ఇది కలి్పస్తోంది. ఇక 2020లో ప్రవేశపెట్టిన ‘అమెజాన్ పే లేటర్’ కూడా బాగానే ‘‘క్లిక్’ అయింది. కాగా, ఈ పేమెంట్ ఆప్షన్లతో క్యూ–కామ్ సంస్థల సగటు ఆర్డర్ విలువ పెరగడంతో పాటు ఎక్కువ రేటు గల ఉత్పత్తి విభాగాల్లోకి కూడా విస్తరించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు గనుక కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగితే, ఈకామర్స్ దిగ్గజాలకు సవాలుగా నిలవడం ఖాయమని కూడా వారు విశ్లేషిస్తున్నారు.40 బిలియన్ డాలర్లుభారత్ క్విక్ కామార్స్ మార్కెట్‌ను ప్రధానంగా మూడు కంపెనీలు (జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో) శాసిస్తున్నాయి. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా.75% స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు వాయిదాల్లోనే... ‘పే లేటర్, ఈఎంఐ ఫార్మాట్ల వల్ల క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. సంప్రదాయ ఈకామర్స్ దిగ్గజాలతో మరింతగా పోటీపడేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పే లేటర్ సదుపాయం వల్ల యూజర్ల మెరుగైన షాపింగ్ అనుభూతికి తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, గృహోపకారణాల వంటి అధిక ధర కేటగిరీ కొనుగోళ్లలో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈకామర్స్ మాదిరిగానే పోటాపోటీ ధరలతో పాటు అనువైన పేమెంట్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేయడం ద్వారా క్యూకామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతాయి’ అని డేటమ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో 75 శాతం పైగా స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ రూట్లోనే అమ్ముడవుతుండటం విశేషం! అయితే, ప్రస్తుతం క్విక్ కామ్ ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మేర కిరాణా, నిత్యావసర ఉత్పత్తులేనని, ఈ పేమెంట్ ఆప్షన్లు తక్షణం వాటికి పెద్దగా ఉపయోగకరం కాదనేది మరో టాప్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుడి అభిప్రాయం. ‘రానురాను ప్రీమియం విభాగాల్లోకి విస్తరించే కొద్దీ పే లేటర్, ఈఎంఐ వంటి ఆప్షన్లు క్విక్ కామ్ డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడతాయి. ఇది ఈకామర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే అవి మరిన్ని వినూత్న విధానాలను అనుసరించక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది. – అల్బిందర్ ధిండ్సా, బ్లింకిట్ సీఈఓ -
రుణ వాయిదాలకే నెలకు రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి నిర్వహణ కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో రూ. 246 కోట్ల వ్యయంతో రావిర్యాలలో నిర్మించిన మెగా యూనిట్ ఈ కష్టాలకు కారణం కానుంది. త్వరలో మీద పడనున్న ఆర్థిక భారం డెయిరీకి పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. ఈ మెగా యూనిట్ నిర్వహణను పకడ్బందీగా గాడిలోకి తెచి్చన తర్వాతే పూర్తిస్థాయిలో డెయిరీకి అప్పగించాల్సిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కూడా తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా యూనిట్‌ను ఏం చేయాలి? ఎలా నడపాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తరుముకొస్తున్న కష్టాలు..సరైన అంచనాలు, సౌకర్యాల కల్పన, ప్రణాళికలు లేకుండా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగా యూనిట్ చిక్కుల్లో పడింది. నీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఈ డెయిరీని ఏర్పాటు చేయడంతో కేవలం ప్లాంటును నడిపించేందుకు నీటి కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇక, ఈ యూనిట్ కరెంటు బిల్లులు నెలకు రూ. కోటి దాటుతున్నాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి నెలకు రూ.2 కోట్ల వరకు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. ఇవేకాక, ప్లాంటు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు అదనం కావడంతో ప్రారంభించిన తొమ్మిది నెలలకే మెగా యూనిట్ నిర్వహణ విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని డెయిరీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి, లాలాపేటలోని యూనిట్ ద్వారా విజయ డెయిరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి పంపుతోంది. ఈ యూనిట్‌ను నడుపుతూనే రావిర్యాలలో రోజుకు 5–8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు చేసే అంచనాలతో, ఆ మేరకు అత్యాధునిక యంత్రాంగంతో మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3 లక్షల లీటర్ల ఉత్పత్తులను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ఈ మేరకు ఉత్పత్తి చేసేందుకు డెయిరీకి ఆర్థికంగా భారమవుతోంది. రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తికి, 8 లక్షల వరకు లీటర్ల ఉత్పత్తికి అయ్యే నిర్వహణ ఖర్చులో పెద్దగా తేడా ఉండదని, ఈ నేపథ్యంలో 8 లక్షల లీటర్ల వరకు ఉత్పత్తి జరిగితేనే యూనిట్ మనుగడ సాధ్యమవుతుందని డెయిరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేని పరిస్థితుల్లో మెగా యూనిట్ నిర్వహణ భారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!
ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది. కోవిడ్–19 కన్నా పావుశాతం అధికం... తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. ► రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5%కి ఇది దిగివస్తుంది. ► భారత్ వద్ద ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే, అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ కరెన్సీ పటిష్టంగానే ఉంది. ► భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్ఆర్ఐలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది. ► 2021 ఏప్రిల్–జూన్ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది. డిపాజిట్లను సమీకరించుకోండి! రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఐసీఐసీఐ, పీఎన్బీ వడ్డింపు.. న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 9.10%కి పెంచింది. పీఎన్బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది. -
నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి
Radhika Madan Opens Up About Love: 'నాకు ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించడం నచ్చదు. అందుకే లవ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. అయితే జీరో పర్సెంట్ లేదంటే 100%' అంటూ లవ్ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్. ఇటీవలె ఆమె నటించిన 'శిద్ధత్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాధిక ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక 'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభం చేసిన రాధిక 'పటాకా' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో రాధిక నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందింది. తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరిస్తానని, 200శాతం బెస్ట్‌గా ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. కాగా ఈమె నటించి శిద్ధత్ సినిమా అక్టోబర్ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
శ్రీవారూ... వాయిదాల వాదనలు!
ఉత్త(మ)పురుష మా శ్రీవారి తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే అవేవీ సక్రమమైన మార్గంలో ఉండవు. నేను ఏదైనా పని చెప్పగానే అప్పటికప్పుడు ఠక్కున చేయరు. ఏదో వంక పెట్టేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఉండబట్టలేక ఓ రోజు అడిగా... ‘‘ఎందుకండీ ఎప్పటిపని అప్పుడు చేయరు? ఎలాగైనా చేయాల్సిందే కదా. చేసేస్తే పని తీరిపోతుంది కదా. వాయిదా వేస్తే పని అలాగే మిగిలి ఒత్తిడి పెరుగుతుంది కదా?’’ అన్నది నా ప్రశ్న. ‘‘అందుకే అప్పటికప్పుడు క్లియర్ చేసేయండి’’ అన్నది నా సలహా. దానికి మా ఆయన ఇచ్చిన జవాబు బంగారు అక్షరాలతో లిఖించదగ్గది. ‘‘ఏవోయ్... వాయిదాలు లేకపోతే ప్రపంచంలో అందం లేదోయ్. నువ్వు ఓ ఫ్లాటో లేదో ఇంటిజాగానో కొనుక్కుంటావ్. బ్యాంకు వాడు నీకు లోనిచ్చి... వాయిదాల ప్రకారం నీ దగ్గర ఈఎమ్ఐలు వసూలు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు అద్దె ఇంటికి చెల్లించినట్టు కాసిన్ని రోజులు వాయిదాలు చెల్లిస్తావు. ఒకనాటికి ఇల్లు నీ సొంతమవుతుంది. ఒకవేళ నీకు వాయిదాలు అన్న కాన్సెప్టే నచ్చనిదనుకో. రొక్కం మొత్తం ఒకేసారి ఇవ్వాలన్నది నీ పాలసీ అనుకో. నీకీ జన్మలో ఇల్లు సొంతం కాదు. అదీ వాయిదాల గొప్పదనం. ఇక న్యాయవ్యవస్థ మొత్తం వాయిదాల మీదే ఆధారపడి ఉంది. వాదనలన్నీ ఒకేరోజు వినాలంటే ఎంత పెద్ద జడ్జీకైనా కష్టమే. అందుకే వాయిదాల లెక్కన రోజుకు ఇన్నని కొన్ని వాదనలు విని నిస్పాక్షికంగా తీర్పిస్తారు జడ్జిగారు. అంతేనా... దేవుడికి సైతం పూజలన్నీ చేయడానికి ఒక్క రోజు సరిపోక నవరాత్రోత్సవాలంటూ వాయిదాల పద్ధతిన ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అంతెందుకు... సముద్రం దగ్గర ఏకమొత్తంలో నీళ్లు అప్పుతీసుకున్న మబ్బులు... తడవకింతని వర్షం రూపంలో తీరుస్తాయి. అదేగానీ మబ్బులు ఒకేసారి అప్పు తీర్చేశాయనుకో... ఏ తుఫానో, వరదలో వచ్చి ఉత్పాతాల్లో ఉస్సూరమనాల్సిన ఖర్మ మనుషులది. అందుకే నేనేదైనా పని వాయిదా వేస్తున్నానంటే అందులో ఓ అంతరార్థం, ఎంతో ప్రకృతిప్రేమా, బోల్డంత దైవభక్తీ ఉన్నాయన్నమాట’’ అంటూ ఓ లెక్చర్ దంచారు మా ఆయన. ఏవండీ... ఎంత (అతి) తెలివైన వారు కాకపోతే... ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులను వేసే వాయిదాకీ... చెల్లింపుల వాయిదాకీ ముడేస్తారు చెప్పండి. అందుకే ఆయన బోడిగుండుకీ, మోకాలికీ ఎక్కడ ముడేస్తారో అనే భయం కొద్దీ ఆయనకు దేవుడు జుట్టే లేకుండా బట్టతల ఉంచేశాడు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో అప్పటికి తెలియలేదు నాకు. ‘‘ఇందండి మన బుజ్జిగాడి ప్రోగ్రెస్ కార్డు. సంతకం పెట్టండి’’ అంటూ ఓ కార్డు అందించా. ఆ మార్కులను చూసి అద్దిరిపోయారు మావారు. ‘‘ఇవేం మార్కులోయ్. ఏవీ చదవట్లేదా వెధవ. కనీసం పాస్‌మార్కులు కూడా రాలేదు. ఇలా అయితే ఎలా? కాస్త కూర్చుని ప్రైవేటు చెప్పు వాడికి’’ అంటూ మరో పని పురమాయించారు నాకు. ‘‘చెప్పి చూశానండీ... వాడెమన్నాడో తెలుసా? నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తాడట. పాస్ కావడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశాట్ట వెధవ. ఎంత తెలివో! అంతా అచ్చం తండ్రి పోలికే’’ అన్నాను. అంతే! దెబ్బతో మా వారికి దిమ్మ తిరిగి పోయినట్లుంది. పనులు వాయిదా వేసే పనిని నిరవధికంగా వాయిదా వేసి, ఎప్పటి పని అప్పుడు చేస్తున్నారు. ఆ మరుసటి నెలలో మావారికి బుద్ధి చెప్పడం కోసం నేను తయారు చేయించిన ప్రోగ్రెస్కార్డు మీద కాకుండా... అసలు దాని మీదే ఆయన సంతకం చేయించి మావారు తన మనశ్శాంతిని వాయిదా వేసుకోకుండా చూశా. - వై! -
ఐబిఎ నూతన చైర్మన్ ఎవరు?
Banks Special GENERAL AWARENESS 1. Which of the following private banks announced EMI facility on debit cards to enable its customers to convert their high value transactions into easy installments on August 19, 2014? 1) ICICI Bank 2) Axis Bank 3) HDFC Bank 4) IndusInd Bank 5) Yes Bank 2. Which senior congress leader took over as the new Chairman of Parli-ament's Public Accounts Comm-ittee (PAC) on August 20, 2014? 1) Kamal Nath 2) K.V. Thomas 3) Mallikarjun Kharge 4) A.K. Antony 5)Jairam Ramesh 3. U.R. Ananthamurty died on August 22, 2014. He won the 1994 Jnanpith Award for writings in which of the following languages? 1) Telugu 2) Tamil 3) Kannada 4) Malayalam 5) Marathi 4. Who was elected as the Chairman of the Indian Banks' Association (IBA) for 2014-15? (He succeeds K.R. Kamath) 1) Rakesh Sethi 2) C.V.R. Rajendran 3) S.S. Mundra 4) T.M. Bhasin 5) R.K. Dubey 5. Who bagged India's first medal in the second Youth Olympic Games by winning a silver in the men's 77kg weightlifting catego-ry in Nanjing, China on August 22, 2014? 1) Maymon Poulose 2) Mithra Varun 3) Lalu Taku 4) Ragala Venkata Rahul 5) None of these 6. The world's first Hindu eco te-mple Shree Swaminarayan Mandir was opened in which of the following cities on August 19, 2014? 1) Angkor Wat 2) New Delhi 3) London 4) Chicago 5) New York 7. Who won the men's singles title at the 44th All India inter-institutional table tennis championship in New Delhi on August 22, 2014? 1) Soumyajit Ghosh 2) Sanil Shetty 3) Sarthak Gandhi 4) G.Sathiyan 5) Sourav Saha 8. Who won the women's singles title at the 44th All India inter-institutional table tennis cham-pionship on August 22, 2014? 1) Poulomi Ghatak 2) Pooja Sahasrabudhe 3) Mousumi Paul 4) Madhurika Patkar 5) Nikhat Bhanu 9. Identify the mismatched pair? Public Sector Bank CMD 1) Punjab National Bank K.R. Kamath 2) UCO Bank Arun Kaul 3) Oriental Bank of Commerce S.L. Bansal 4) Indian Bank T.M. Bhasin 5) Bank of India Rajeev Rishi 10. The Depositor Education and Awareness Fund (DEAF) has be-en announced by? 1) Public sector banks 2) SEBI 3) SBI 4) RBI 5) Government of India 11. An unclaimed deposit is one wherein an account is not operated for? 1) Six months 2) One year 3) Two years 4) Ten years 5) Five years 12. The Hindustan Motors suspe-nded the production of which of the following cars in May 2014? 1) Morris Oxford 2) Ambassador 3) Contessa 4) Land Rover 5) None of these 13. With which of the following is the term 'pre-shipment finance' related? 1) Farm credit 2) Consumer credit 3) Export credit 4) Industrial credit 5) None of these 14. Recapitalization in public sector banks is done to meet the? 1) CASA ratio 2) Capital adequacy norms 3) Ratio of NPAs 4) Credit to deposit ratio 5) None of these 15. Mukul Rohatgi has recently been appointed as the new? 1) Chief Information Commissi-oner 2) Chief Vigilance Commissi-oner 3) Solicitor General 4) Principal Secretary to the Pri-me Minister 5) Attorney General 16. Which country suspended $10 million contribution to the Com-monwealth secretariat over alle-ged human rights abuses in Sri Lanka? 1) UK 2) India 3) Bangladesh 4) New Zealand 5) Canada 17. Who is the Commonwealth Cha-irperson-in-Office at present? 1) Queen Elizabeth II 2) Kamalesh Sharma 3) Mahinda Rajapakse 4) David Cameron 5) Stephen Harper 18. Nobel laureate Muhammad Yunus is well known for his contribution to Bangladesh's? 1) Agro credit sector 2) Consumer credit sector 3) Housing finance sector 4) Micro credit sector 5) Retail credit sector 19. Sachin Tendulkar has been named as the goodwill am-bassador for the 35th National Games to be held in? 1) Manipur 2) Jharkhand 3) Kerala 4) Goa 5) Maharashtra 20. The United Nations and the In-ternational Olympic Committee (IOC) have signed a historic agreement in April 2014 to use the power of sports to promote? 1) World trade and commerce 2) Peace and development 3) Literacy and awareness 4) Peaceful uses of nuclear tech-nology 5) None of these 21. The Indian Banks' Association members comprise of? 1) Public sector banks 2) Private sector banks 3) Foreign banks having offices in India 4) Urban cooperative banks 5) All the above 22. Which of the following was sta-rted in 1946? 1) RBI 2) NABARD 3) SBI 4) IBA 5) None of these 23. Which of the following is the location of the permanent office of the International Mathema-tical Union (IMU)? 1) Paris 2) Frankfurt 3) Berlin 4) Berne 5) Madrid 24. The International Congress of Mathematicians (ICM) will be held in which of the following cities in August 2018? 1) Hyderabad 2) Madrid 3) Melbourne 4) Rio de Janeiro 5) Durban 25. Kruger National Park is in the news recently. It is located in? 1) Kenya 2) Ethiopia 3) Somalia 4) Tunisia 5) South Africa 26. Which of the following is known as the Jasmine Revolution? 1) Czech uprising 2) Sudan uprising 3) Libyan uprising 4) Syria revolution 5) Tunisian revolution 27. Turkey is a member of which of the following groups/ organiza-tions? 1) G20 2) NATO 3) ASEAN 4) Both 1 and 2 5) All 1, 2 and 3 28. Mark Rutte is in the news recently. He is the Prime Minister of which of the following countries? 1) Slovenia 2) Belgium 3) Netherlands 4) Luxembourg 5) Finland 29. The third edition of the Nuclear Security Summit was held in which of the following cities on March 24-25, 2014? 1) Seoul 2) The Hague 3) New Delhi 4) Tokyo 5) Sydney 30. The Nuclear Security Summit aims to prevent nuclear terrorism by? 1) Reducing the amount of dan-gerous nuclear material in the world 2) Improving the security of all nuclear material and radio-active sources 3) Improving international coo-peration 4) Both 1 and 2 5) 1, 2 and 3 KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 4; 6) 3; 7) 4; 8) 1; 9) 5; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 2; 15) 5; 16) 5; 17) 3; 18) 4; 19) 3; 20) 2; 21) 5; 22) 4; 23) 3; 24) 4; 25) 5; 26) 5; 27) 4; 28) 3; 29) 2; 30) 5. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ఇంధనాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - కె.నరేంద్రనాథ్, కాచిగూడ ఏ పోటీ పరీక్ష అయినా ఎగ్జామినర్‌కి తప్పకుండా మదిలో మెదిలే అంశం ఇంధనాలు. సాంప్రదాయికంగా వాడుకలో ఉన్న పిడకలు, కలప మొదలుకొని ఎల్పీజీ, గోబర్ గ్యాస్ లాంటివన్నీ ఇంధనాలే. సాధారణంగా పెట్రోల్, కిరోసిన్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాలు; ఎల్పీజీ, సీఎన్జీ లాంటి వాయు ఇంధనాలకు ఆధారం పెట్రోలియం. క్రూడ్ ఆయిల్‌ను ‘పాక్షిక అంశిక స్వేదన’ పద్ధతిలో రిఫైనరీల్లో శుద్ధిచేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలతోపాటు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఏయే అనుఘటకాలు వస్తాయో అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మొదట సహజవాయువు వస్తుంది. చివరగా ‘తారు’ మిగులుతుంది. వివిధ ఇంధనాల్లోని రసాయన పదార్థాల గురించి కూడా అడగవచ్చు. సాధారణంగా ఏ ఇంధనమైనా వివిధ హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఉదాహరణకు ఎల్పీజీలో ప్రధాన అనుఘటకం ‘బ్యూటేన్’, సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు ‘మీథేన్’. ఇవేకాకుండా జీవ వ్యర్థాల నుంచి తయారయ్యేది బయోగ్యాస్. పేడ నుంచి తయారయ్యేది గోబర్ గ్యాస్. రెండింట్లోనూ ప్రధాన అనుఘటకం మీథేన్. ఇవన్నీ హైడ్రోకార్బన్‌లే. అంటే కార్బన్, హైడ్రోజన్‌లతో నిర్మితమై ఉన్నాయి. వీటిని మండించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి వెలువడతాయి. రాకెట్లలో తక్కువ బరువుండి ఎక్కువ శక్తినిచ్చే ఇంధనాలు కావాలి. ద్రవ హైడ్రోజన్ మంచి ఇంధనం. ఇది మండినప్పుడు కేవలం నీరు విడుదలవుతుంది. ఇది పర్యావరణ హితమైన (నష్టం చేయని) ఇంధనం. ప్రతి గ్రాముకి ఎంత శక్తివిడుదలవుతుందనేది ఆ ఇంధన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేనికి ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే దాని సామర్థ్యం అధికం. ఇంధనాలపై ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అలాగే హైడ్రోకార్బన్ల గురించి తప్పనిసరిగా చదవాలి. - డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ.