ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక | no decision on election contest, says radhika | Sakshi
Sakshi News home page

ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక

Published Sat, Mar 19 2016 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక

ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక

 నటి రాధిక


వేలూరు: రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోలేదని సినీ నటి రాధిక తెలిపారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో గురువారం సాయంత్రం సినీ నటి రాధిక తన కుమార్తె రేయాన్, కుమారుడు రాహుల్ శరత్‌తో కలిసి స్వామి దర్శించుకున్నారు అనంతరం స్వామి స్వామి సన్నధి, అమ్మన్ సన్నధిలోని స్వామి వారిని మొక్కుకున్నారు.

అనంతరం నవగ్రహ సన్నధిలో నెయ్యి దీపాలను వెలిగించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహం త్వరలో జరుగనుందని అందువల్ల తన కుమార్తె, కుమారుడితో కలిసి స్వామి దర్శనం చేసుకున్నానన్నారు. ఎన్నికలు, రాజకీయాల సంబంధమైన ప్రశ్నలకు శరత్‌కుమార్‌ను అడగాలన్నారు.

సమత్తవ మక్కల్ పార్టీ ద్వారా తాను పోటీ చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని, మంచి ప్రభుత్వం ఏర్పాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆమెకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement