![Young Woman Deceased in Road Accident Srikakulam - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/24/radhika.jpg.webp?itok=qnVKQPvy)
రాధిక (ఫైల్)
రాజాం సిటీ: మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన దుప్పలపూడి రాధిక (17) సైకిల్‌పై రాజాం వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మరణ వార్త విన్న తల్లిదండ్రులు జయలక్ష్మి, మురళి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలియజేశారు.(చుక్కేసి.. చిక్కేసిన జూడాలు )
ప్రమాదకరంగా బ్రిడ్జి ప్రాంతం
శ్రీకాకుళం రోడ్డులో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఒకవైపు ఎత్తుగా ఉండడంతో వచ్చిన వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడే గతేడాది ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అలాగే గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. అందువలన ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment