మందుబాబుల ర్యాష్ డ్రైవింగ్కు 9 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన చిన్నారి రమ్యను చూసి తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. అదే ప్రమాదంలో కాలు విరిగి, యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం కేర్ ఆసుపత్రికి చేరుకొని.. కూతురు మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయారు. చిన్నారి మృతితో రమ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.