
ఆరోపనలు ఎదుర్కోంటున్న నటడు అమిత్
బొమ్మనహళ్లి : శాండిల్‌వుట్ నటుడు అమిత్‌పై ఓ సహాయ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఇక్కడి ఆర్‌ఆర్ నగర పోలీసులకు బుల్లితెర నటి రాధిక శెట్టి ఫిర్యాదు చేసింది. వివరాలు... బుల్లితెర సహాయ నటిగా గుర్తింపు పొందిన రాధికకు గతంలోనే పెళ్లి జరిగింది. ఈమెకు 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న రాధిక అమిత్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం అమిత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని రాధిక ఆరోపిస్తోంది.
తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. 2013 మేలో వివాహం చేసుకున్నామని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. 2017 నవంబర్ వరకు కలిసి ఉన్నామని, అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని, విషయం తెలిసి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై అమిత్ ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయంపై అమిత్ తల్లి స్పందిస్తూ తన కుమారుడికి రాధికతో వివాహం కాలేదని, సినిమా ఫొటోలు తీసుకుని డబ్బుల కోసం బ్లాక్‌మొయిల్ చేస్తోందని ఆమె ఆరోపించింది.