
‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా...’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక మృతిచెందారు. ఈ పాట ఘనవిజయం సాధించినా.. తెలుగునాట ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్నో పాటలు పాడిన రాధిక 47ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. తిరుపతిలో జన్మించిన ఈ గాయని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. 2004 నుంచి సినీరంగానికి దూరంగా ఉంటున్నఆమె చెన్నై పాలవాక్కంలో నివసిస్తున్నారు. శుక్రవారం దయం 6.30 సమయంలో ఆమె మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలిపారు. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.