
ఆత్మ తపన!
మరణం తర్వాత కూడా తన స్నేహితుల కోసం తపించే ఓ వ్యక్తి ఆత్మ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్‌మెంట్’. విజయ్‌శ్రీరామ్, నవీన్, రాధిక ముఖ్యపాత్రల్లో స్వామిచంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.