వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్‌​ ఫోటోలు | Actress Radhika Sarathkumar New Look Photos Viral In Social Media | Sakshi
Sakshi News home page

వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్‌​ ఫోటోలు

Published Thu, Apr 29 2021 1:04 PM | Last Updated on Thu, Apr 29 2021 3:50 PM

Actress Radhika Sarathkumar New Look Photos Viral In Social Media - Sakshi

సినీ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్‌ కట్‌ చేయించి న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..ఈ కొత్త లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశాస్తున్నానంటూ పేర్కొన్నారు. మొన్నటి దాకా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు మేక్‌ఓవర్‌పై దృష్టి పెట్టినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెక్‌బౌన్స్‌ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా స్పందించిన రాధిక..అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొంది. తనకు కరోనా సోకలేదని, కానీ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. 

చదవండి : శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
'ప్రభాస్‌ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement