రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం | Radhika's Daughter Rayane Engagement With Cricketer Abhimanyu | Sakshi
Sakshi News home page

రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం

Published Thu, Sep 24 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం

రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం

తమిళసినిమా: ప్రముఖ నటుడు శరత్‌కుమార్, రాధిక దంపతుల కూతురు రెయాన్, అభిమన్యు మిథున్ వివాహ నిశ్చితార్థం బుధవారం ఉదయం చెన్నైలో ఆడంబరంగా జరిగింది. ఈ వేడుకకు నటుడు ప్రభు, రామ్‌కుమార్, రాధారవి, కే.భాగ్యరాజ్, మోహన్, శివకుమార్, అరవింద్‌సామి, రాంకీ,పృథ్వీ, జిత్తన్మ్రేశ్, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్,శోభా దంపతులు,సముద్రకని, బాలాజీమోహన్,హరి,నిర్మాత కలైపులి ఎస్.థాను,ఆర్‌బీ.చౌదరి,టీజీ.త్యాగరాజన్,అన్భుసెళియన్,టీ.శివ,శ్రీప్రియ,అంభిక,మీనా,నళిని,సీమ,సరిత,జ్యోతిక, సీత,కుష్భూ, నిరోషా,సంగీత విజయ్, సుహాసిని, ఆర్తి జయంరవి సినీ ప్రముఖులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
 
 ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
  ముఖ్యమంతి జయలలిత అభిమన్యు మిథున్, రెయాన్‌ల వివాహ నిశ్చితార్థ వేడుక సందర్భంగా లేఖ ద్వారా వారికి శుభాకాంక్షలు అందించారు.అందులో వివాహ నిశ్చితార్థ వేడుకకు శరత్‌కుమార్,రాధికతనను ఆహ్వానించడం సంతోషకరం.అయితే ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా తాను రాలేని పరిస్థితి. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement