saratkumar
-
మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ► ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్,రాధిక దంపతులు ► మంత్రి విజయభాస్కర్‌కు పదవీగండం? ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్, రాధిక: సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్‌ను ఈ నెల 6వ తేదీన శరత్‌కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్‌కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు. ఈనెల 11వ తేదీన శరత్‌కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్‌కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు. స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు. ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్‌ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్‌పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది. -
థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘నేనో రకం’. వంశీధర్ రెడ్డి సమర్పణలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘మారిన తెలుగు సినిమా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందింది. హీరోగా నా కెరీర్‌కు ఉపయోగపడే చిత్రమిది’’ అని అన్నారు. మా చిత్రం ఎన్నో వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ, సరికొత్త థ్రిల్ అందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. -
పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం తారైతప్పట్టై.ఆ చిత్రం పెద్దగా ప్రేక్షదారణ పొందక పోయినా అందులో కథానాయకిగా నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభినయానికి మాత్రం ప్రశంసల జల్లు కురిసిందనే చెప్పాలి. అందులో ఆమె గరగాట కళాకారిణిగా నటించారు. తాజాగా యాక్షన్ అవతారమెత్తడం విశేషం. ఎస్ వరలక్ష్మి శరత్‌కుమార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నిపుణన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాధారణంగా పోలీస్ అధికారి పాత్రలను అర్జున్ పోషిస్తుంటారు. అయితే ఈ నిపుణన్ చిత్రంలో దర్శకుడు ఆయన్ని మరో వైవిధ్యభరిత పాత్రలో నటింపజేస్తూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఖాకీ దుస్తులు ధరింపజేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా యాక్షన్ అవతారం ఎత్తించారట. నిపుణన్ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఎక్కువగా పోలీస్ దుస్తుల్లోనే కనిపిస్తారట. ఇందులో ఆమె వీరోచిత ఫైట్స్ కూడా చేస్తున్నారట. తారైతప్పట్టై చిత్రం తరువాత తనను మరో కోణంలో చూపించే నిపుణన్ చిత్రం అంతకంటే మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పటికే ఒక కన్నడ చిత్రంలో నటిం చిన ఈ బ్యూటీ తాజాగా మలయాళ ంలోకి పరిచయం అవుతున్నారు. అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటిస్తున్నారు. -
సంక్రాంతికి సినిమాల సందడి
తమిళులు పొంగల్‌గా జరుపుకునే ముఖ్య పండగ సంక్రాంతి. దీన్ని సినీ వర్గాల పండగగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున పలు భారీ చిత్రాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతారు. అలా ఈ ఎడాది నాలుగు చిత్రాలు పొంగల్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిలో కథాకళి, గెత్తు,రజనీమురుగన్, తారైతప్పట్టై చోటు చేసుకున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్టెయిన్మెంట్తో రూపొందిన చిత్రం అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. దీన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహిస్తున్న చిత్రం తారైతప్పట్టై. శశికుమార్ హీరోగా నటిస్తూ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు వెయ్యొవ చిత్రం కావడం విశేషం. తమిళనాట ప్రసిద్ధి గాంచిన గరగాట్టం నృత్యం ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం తారైతప్పట్టై. దీనికి దర్శకుడు బాలా బి.స్టూడియోస్, ఐన్గరన్ ఇంటర్నేషనల్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు నిర్మాణంలో భాగస్వామిగా ఉండడం విశేషం. మూడో చిత్రం గెత్తు. యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గెత్తు. ఇందులో ఎమిజాక్సన్ హీరోయిన్. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరోగా అవతారమెత్తారు. తిరుకుమరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొంగల్ రేస్‌లో ఉంది. ఇక నాల్గవ చిత్రం రజనీమురుగన్. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్. పొన్రామ్ దర్శకుడు. దర్శకుడు లింగసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. డీ. ఇమాన్ బాణీలు కట్టిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలమైంది. పలు సమస్యలను ఎదుర్కొని, పలుమార్లు విడుదల తేదీలు వాయిదాపడ్డా ఎట్టకేలకు పొంగల్‌కు తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది తొలిరోజే ఎనిమిది చిత్రాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ నాలుగు చిత్రాలకు ముందే 8వ తేదీన కైల పూ మాలై చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏ చిత్రం కాసుల వర్షం కురిపించి విజయం అనిపించుకుంటాయో వేచి చూడాలి. -
ఫ్లాట్ ప్రత్యూషకిస్తా
అభ్యంతరం లేదంటూ హైకోర్టుకు తెలిపిన తండ్రి సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూష కేసు మరింత పురోగతి సాధించింది. తన పేరు మీదున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి రమేష్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) శరత్‌కుమార్ తన వాదనలు వినిపించారు. తన పేరు మీదనున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు అంగీకరించినట్టు శరత్‌కుమార్ విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫ్లాట్‌పై వచ్చే అద్దె ప్రత్యూషకు అందేలా చూడాలని సూచించింది. సంక్రాంతి సెలవుల లోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని శరత్‌కుమార్ ధర్మాసనానికి తెలిపారు. -
ఢీ అంటే ఢీ
►నడిగర్ సంఘం ఎన్నికలు నేడే ► బరిలో శరత్‌కుమార్, విశాల్ జట్లు ► రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్న వైనం ► విజయం ఎవరిదో? పరిశ్రమలో ఉత్కంఠ తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) మునుపెప్పుడూ లేనంతగా పత్రికల్లో పెద్దపెద్ద హెడ్డింగ్ల్లో వాడివేడి పదజాలాలతో ఒక రకమైన ఉత్కం ఠను కలగజేస్తూ వస్తోంది. ఇందుకు కారణం ఆ సంఘం ఎన్నికలే. సినీ రంగం రెండుగా చీలే రీతిలో తాజా ఎన్నికల సమరం సాగుతోంది. ఎవరిది పైచేయి అన్నది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది. ఈ సమయంలో నడిగర్ సంఘం పూర్వోత్తరాల విషయాలకు ఓ మారు వెళితే... పురట్చి తలైవర్ ఎంజీఆర్, నడిగర్ తిలగం శివాజీగణేశన్ కాలంలో(1952) ఆవిర్భవించిన ఈ సంఘం ఆరు శతాబ్దాలకు పైగా సమష్టిగా సభ్యుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ వస్తోంది. నడిగర్ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహంచడం ఆనవాయితీ. అలాంటిది ప్రస్తుత కార్య నిర్వాహకవర్గంగా ఉన్న నటుడు శరత్‌కుమార్ బృందం సుమారు పదేళ్లపాటుగా ఏకధాటిగా బాధ్యతల్ని నిర్వహించడం విశేషమనే చెప్పాలి. ఆ జట్టు మళ్లీ సంఘం పదవీ బాధ్యతల్ని ఆశిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా లేక పోతే సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతల్ని చేపడుతూ వచ్చారన్నది గమనార్హం. అలాంటిది శరత్‌కుమార్ ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకింది. నటుడు విశాల్ రూపంలో ఆయనకు పోటీ ఎదురయ్యింది. ఇది మామూలు పోటీ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అన్యాయాలు, అక్రమాలు అంటూ ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలాగే, ఒకరి మీద మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా, కోర్టుల్లో పిటిషన్లు సైతం పోటీ పడి మరీ దాఖలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే జాతి, మతం, భాషలను ఎత్తి చూపుతూ దూషించుకునే స్థాయికి చేరింది. పచ్చిగా చెప్పాలంటే తమిళ చిత్ర పరిశ్రమే రెండుగా చీలిపోయే పరిస్థితి దాపురిస్తుందేమో నన్నంత భయపడేలా. నటుడు శరత్‌కుమార్ శుక్రవారం ఆవేశంగా మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఒకటిగా కలిసే అవకాశంమే లేదని వ్యాఖ్యానించారు. తమిళ నిర్మాతల మండలి శరత్‌కుమార్ జట్టకు మద్దతు ఉందంటూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ మండలి మెడకు చుట్టుకునే పరిస్థితి ఎదురయ్యింది. మండలిలోని చాలా మంది సభ్యులు ఆ మండలి అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతల మండలిలో ముఖ్య పదవిలో ఉన్న జ్ఞానవేల్ రాజా (స్టూడియో గ్రీన్ సంస్థ) మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమావేశంలో 500 వరకు పైగా నిర్మాతలు పాల్గొన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితికి కారణాలేమిటి? నడిగర్ సంఘం ఎన్నికలు ఇంత గట్టి పోటీని ఎదుర్కోవడానికి, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి కారణాలేమిటన్నదానికి కొంచెం వెనక్కు వెళ్లిచూస్తే స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని సంఘం కార్యాల యాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా బహుళ సముదాయ భవన నిర్మాణ బాధ్యతల్ని ఎస్పీఎస్ సంస్థకు అప్పగించారు. ఆ వ్యవహారాలను సంఘ సభ్యుడైన నటుడు పూచి మురుగన్ ప్రశ్నించారు. ఆ విషయంలో ఆయనకు సంతృప్తికరమైన సమాధానం రాలేదంటూ సంఘం భవన నిర్మాణం ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించడంతో పాటు కోర్టు వరకూ వెళ్లారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో భవన నిర్మాణం ఆగిపోయింది. నటుడు విశాల్ రంగప్రవేశం ఈ వ్యవహారం నాన్చుకుంటూ పోవడంతో నటుడు విశాల్ రంగంలోకి దిగారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం చిత్ర నిర్మాణం చేపడితే తాము పారితోషికం లేకుండా నటిస్తామని, తద్వారా వచ్చిన ఆదాయంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని బాహాటంగానే ప్రకటించారు. ఆ విధంగా సంఘం వ్యవహారాలను ప్రశ్నించడంతో సంఘ నిర్వాహకులకు విశాల్ దూరం పెరుగుతూ వచ్చింది. అలా మొదలై వ్యక్తిగత దూషణల వరకు వ్యవహారం వెళ్లింది. తనను అవమానించారంటే, తమను విమర్శించారంటూ ఆరోపణల పర్వానికి తెరలేచింది. ఇది ఇరు జట్టులను ఎన్నికల బరిలోకి దూకే వరకూ దారి తీయించింది. పరిస్థితిని గమనించిన తమిళ నిర్మాతల మండలి, తమిళ సినీ దర్శకుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(పెప్సీ) ప్రతినిధులు సమస్యను సామరస్య చర్చల ద్వారా పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో విశాల్ జట్టు సామరస్యానికి తావే లేదంటూ తెగేసి చెప్పేసింది. దీంతో నడిగర్‌సంఘం ఎన్నికలు అనివార్యమయ్యాయి. హైకోరు విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆదివారం స్థానిక మైలాపూర్‌లోని ఎబాస్ పాఠశాలలో జరగనున్నాయి.మరికొన్ని గంటల్లో ఎన్నికలపర్వం నిర్వహించనున్న నేప్యథంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు పహారా రంగంలోకిదిగింది. ఆదివారమే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ చిత్రపరిశ్రమను వెంటాడుతోంది. -
రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం
తమిళసినిమా: ప్రముఖ నటుడు శరత్‌కుమార్, రాధిక దంపతుల కూతురు రెయాన్, అభిమన్యు మిథున్ వివాహ నిశ్చితార్థం బుధవారం ఉదయం చెన్నైలో ఆడంబరంగా జరిగింది. ఈ వేడుకకు నటుడు ప్రభు, రామ్‌కుమార్, రాధారవి, కే.భాగ్యరాజ్, మోహన్, శివకుమార్, అరవింద్‌సామి, రాంకీ,పృథ్వీ, జిత్తన్మ్రేశ్, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్,శోభా దంపతులు,సముద్రకని, బాలాజీమోహన్,హరి,నిర్మాత కలైపులి ఎస్.థాను,ఆర్బీ.చౌదరి,టీజీ.త్యాగరాజన్,అన్భుసెళియన్,టీ.శివ,శ్రీప్రియ,అంభిక,మీనా,నళిని,సీమ,సరిత,జ్యోతిక, సీత,కుష్భూ, నిరోషా,సంగీత విజయ్, సుహాసిని, ఆర్తి జయంరవి సినీ ప్రముఖులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి శుభాకాంక్షలు ముఖ్యమంతి జయలలిత అభిమన్యు మిథున్, రెయాన్ల వివాహ నిశ్చితార్థ వేడుక సందర్భంగా లేఖ ద్వారా వారికి శుభాకాంక్షలు అందించారు.అందులో వివాహ నిశ్చితార్థ వేడుకకు శరత్‌కుమార్,రాధికతనను ఆహ్వానించడం సంతోషకరం.అయితే ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా తాను రాలేని పరిస్థితి. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. -
జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: తనికెళ్ల భరణి (నటుడు); శరత్‌కుమార్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన శక్తి, సౌందర్య పోషణ అలవడతాయి. కొద్దిపాటి మానసిక ఒత్తిడి, ఒడుదొడుకులు ఉంటాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. పుట్టిన తేదీ 14. అంటే 5. ఇది బుధుడికి సంబంధించినది కావడం వల్ల విద్యార్థులకు బుద్ధిబలం బాగా పెరుగుతుంది. పరీక్షలలో మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీడియా వారికి, కళా సాంస్కృతిక రంగాల వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించడంతోపాటు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. లక్కీ నంబర్స్: 1,2,5, 6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, గ్రే, క్రీమ్, లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: రోజూ కొద్దిసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా పచ్చను ఉంగరంలో ధరించడం, అనాథలకు బెల్లం పాయసం పెట్టడం, బియ్యం దానం చేయడం మంచిది. - డాక్టర్ ముహ్మద్ దావూద్ -
కామెడీకి మాస్ హీరో విశాల్ సై
మదగజరాజా చిత్ర యూనిట్ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రచార యాత్ర చేయనుంది. యువ నటుడు విశాల్ హీరోగా నటించిన చిత్రం మదగజరాజా. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకుడు. ఈయన కమర్షియల్ కథా చిత్రాలను హాస్యంతో రంగరించి రూపొందించడంలో సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో మాస్ హీరో విశాల్‌తో హాస్యం పండించారు. జెమినీ ఫిలింస్ సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని నటుడు విశాల్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. తెలుగులో నటరాజు తనే రాజు (ఎన్టీఆర్) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఆరున విడుదల చేయనున్నారు. సోమవారం కేరళలోని కొచ్చిలో మదగజరాజా చిత్ర యూనిట్ ప్రచారం ప్రారంభించనుంది. తర్వాత కర్ణాటకలోని బెంగళూరు, ఆంధ్రాలోని హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో ఈ ప్రచార బృందం పయనించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాలలో విశాల్‌తో పాటు నటి వరలక్ష్మి, దర్శకుడు సుందర్ సీ, చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.