పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం తారైతప్పట్టై.ఆ చిత్రం పెద్దగా ప్రేక్షదారణ పొందక పోయినా అందులో కథానాయకిగా నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభినయానికి మాత్రం ప్రశంసల జల్లు కురిసిందనే చెప్పాలి. అందులో ఆమె గరగాట కళాకారిణిగా నటించారు. తాజాగా యాక్షన్ అవతారమెత్తడం విశేషం. ఎస్ వరలక్ష్మి శరత్‌కుమార్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు.
అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నిపుణన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాధారణంగా పోలీస్ అధికారి పాత్రలను అర్జున్ పోషిస్తుంటారు. అయితే ఈ నిపుణన్ చిత్రంలో దర్శకుడు ఆయన్ని మరో వైవిధ్యభరిత పాత్రలో నటింపజేస్తూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఖాకీ దుస్తులు ధరింపజేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా యాక్షన్ అవతారం ఎత్తించారట.
నిపుణన్ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఎక్కువగా పోలీస్ దుస్తుల్లోనే కనిపిస్తారట. ఇందులో ఆమె వీరోచిత ఫైట్స్ కూడా చేస్తున్నారట. తారైతప్పట్టై చిత్రం తరువాత తనను మరో కోణంలో చూపించే నిపుణన్ చిత్రం అంతకంటే మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పటికే ఒక కన్నడ చిత్రంలో నటిం చిన ఈ బ్యూటీ తాజాగా మలయాళ ంలోకి పరిచయం అవుతున్నారు. అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటిస్తున్నారు.