రాజస్థాన్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్‌పర్సన్ సుశీల్ ఆనంద్‌తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment