మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్‌తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది.
ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment