అట్టహాసంగా యశ్, రాధిక వివాహం
అట్టహాసంగా యశ్, రాధిక వివాహం
Published Sat, Dec 10 2016 3:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
బొమ్మనహళ్లి (బెంగళూరు) : శాండిల్ ఉడ్‌లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన రాకింగ్ స్టార్ యశ్, నటి రాధిక పండిత్ శుక్రవారం కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగిన వివాహ వేడుకలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగాయి. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో కళాదర్శకుడు అరుణ్ సాగర్ నేతృత్వంలో చూడచక్కని కల్యాణ వేదికను నిర్మించారు. వేదిక ముందు శివపార్వతుల విగ్రహం సాక్షిగా యశ్ మధ్యాహ్నం 12.35 గంటలకు రాధిక మెడలో మూడు ముళ్లు వేశారు.
యువ జోడిని ఆశీర్వదించడానికి ఆది చుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామిజీ, మాజీ సీఎం ఎ.ఎం. కృష్ణ, మాజీ మంత్రులు వీ.సోమన్న, చెలువరాయస్వామి, జమీర్ ఆహ్మద్‌ఖాన్, కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు రవిచంద్రన్, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర, రాజ్‌కుమార్, సుదీప్‌తో పాటు శాండిల్ ఉడ్ తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనాథ్ దంపతులు, దొడ్డణ్ణ, సీనియర్ నటి భారతి విష్ణువర్ధన్, దర్శకుడు పవన్ ఒడెయార్, ఏ.పి. అర్జున్, మహేష్‌రావు, నిర్మాత జయణ్ణ, మంజు, జయ కర్ణాటక అధ్యక్షుడు ముత్తప్ప రైతో పాటు పలువురు పెద్దలు కొత్త దంపతులను ఆశీర్వదించారు.
అంతకు ముందు రాధిక పండిత్ తండ్రి కృష్ణకుమార్ పండిత్ యశ్‌ను కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలు అనంతరం ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామి వద్ద యశ్ ఆశీర్వాదం పొందారు. అనంతరం రాధిక పండిత్‌ను కూడా తండ్రి కృష్ణకుమార్ పండిత్ కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. అంతకు ముందు గౌరీపూజ నిర్వహించారు.
Advertisement
Advertisement